పిక్చర్స్ : స్టార్ హీరో పార్టీలో సందడి చేసిన తారలు
ముంబై : మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌గా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ బాలీవుడ్లో అడుగు పెట్టి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తన సన్నిహితులకు, క్లోజ్ ఫ్రెండ్స్‌కు పార్టీ ఇచ్చారు. ఆయన నటించిన తొలి సినిమా 'ఖయామత్ సే ఖయామత్ తక్' మూవీ విడుదలైన పాతికేళ్లయింది.
ఈ పార్టీకి అమీర్ ఖాన్ మాజీ భార్య రీనా పిల్లలు జునైద్, ఇరాలతో కలిసి హాజరయ్యారు. అదే విధంగా పార్టీకి బాలీవుడ్ నటి జుహి చావ్లా, జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్, పలువురు సినీ రంగ ప్రముఖులు హాజరయ్యారు. ఈ పార్టీలో అమీర్ పూర్తి ఫిట్ నెస్‌తో 30 ఏళ్ల లోపు వ్యక్తిలా కనిపించడం గమనార్హం.
'భారతీయ సినిమా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలోనే నా బాలీవుడ్ కెరీర్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. పరిశ్రమలో నేను భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉంది. అభిమానులను అలరించేందుకు మరిన్ని వైవిద్యమైన పాత్రలు, సినిమాలు చేస్తాను' అని అమీర్ మీడియాకు వెల్లడించారు.

ఖయామత్ సే ఖయామత్ తక్ చిత్రం ద్వారా అమీర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా విడుదలై పాతికేళ్లు పూర్తయింది.

ఈ 25 ఏళ్ల సినీ జీవితం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని, దిలీప్ కుమార్ లాంటి లెజండరీ నటులతో కలిసి పని చేసే అవకావం దక్కడం మరువలేనిదన్నారు.

దిలీప్ కుమార్ తన అభిమాన నటుడని, నేను అయనకు పెద్ద అభిమానిని అని అమీర్ ఖాన్ వెల్లడించారు.

ఈ సందర్భంగా అమీర్ ఖాన్ ఖయామత్ సే ఖయామత్ తక్ చిత్రం స్పెషల్ షో ఏర్పాటు చేసారు.

మనసుకు నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తానని అమీర్ ఖాన్ వెల్లడించారు.

పార్టీలో అమీర్ మాజీ భార్య రీనా, కూతురు ఇరా

పార్టీకి హాజరైన జెనీలియా, రితేష్ దంపతులు

భార్య కిరణ్ రావుతో అమీర్


Click it and Unblock the Notifications











