ఆ హీరో భాద్యత మాదే: పరుచూరి బ్రదర్శ్
ఇండస్ట్రీలో టాప్ రైటర్స్ గా వెలిగిన పరుచూరి బ్రదర్శ్ ఇప్పుడు సరైన హిట్స్ లేక అల్లాడుతున్నారు. అయితే వాళ్ళపై ఇప్పుడు పెద్ద భాద్యత పడింది.తమను కంటిన్యూగా పిలిపించి సినిమాలకు వర్క్ చేయించే ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్ రాజు తన కుమారుడు లాంచింగ్ కి పరుచూరి బ్రదర్స్ నే పూర్తిగా నమ్ముకున్నాడు. సంక్రాంతి రాజుగా పేరు తెచ్చుకున్న రాజు గత కొంత కాలంగా హిట్ అనేది లేకుండా దిక్కు తోచని స్ధితిలో ఉన్నాడు. ఈ నేపధ్యంలో తన సొంత దర్శకత్వంలో తన కుమారుడుని హీరోగా నిలబెట్టి అతనితో సినిమాలు తీస్తూ తన బడ్జెట్ భారం తగ్గించుకోవటమే కాక, తన కొడుక్కి లైఫ్ ఇచ్చినట్లుగా భావిస్తున్నాడు. దాంతో పరుచూరి వారిని పూర్తిగా స్క్రిప్టులో కూర్చోబెట్టి స్క్రిప్టు వర్క్ చేయించి,డైరక్షన్ చేస్తున్నాడు. ఈ విషయమై పరుచూరి బ్రదర్శ్ మాట్లాడుతూ.. అశ్విన్ ని హీరోగా నిలబెట్టడం మా భాధ్యతగా ఫీలవుతున్నాం. మా డైలాగ్ వెర్షన్ పూర్తైంది.సినిమా సెట్స్ మీద ఉంది. హీరో బాగా చేస్తున్నాడు. సినిమా బాగా వస్తోంది అన్నారు.ఇక ఈ సినిమాకు తూనీగ.. తూనీగ అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











