రామ్ చరణ్ 'కనిపిస్తే త్రీడీ, షర్ట్ తీస్తే లోపల సూపర్ బాడీ'
రామ్ చరణ్ తాజా చిత్రంకు పరుచూరి బ్రదర్శ్ డైలాగులు రాస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ తండ్రి చిరంజీవి కెరీర్ లోనే ఎన్నో బిగ్గెస్ట్ హిట్లు ఇచ్చిన ఈ జంట రచయితలు తొలిసారిగా చరణ్ చిత్రానికి డైలాగులు రాస్తున్నారు. ఈ సందర్భంగా వారిని కలిసిన మీడియాతో మాట్లాడుతూ రచ్చలోని తమకు ఇష్టమైన డైలాగుని చెప్పారు. ఆ డైలాగు ఏమిటంటే... అతను అడుగేస్తే ఆడి, కనిపిస్తే త్రీడీ, షర్ట్ తీస్తే లోపల సూపర్ బాడీ. అలాగే రచ్చ చిత్రంలో విలన్, హీరో కలిసినప్పుడల్లా డైలాగులు అదిరిపోతాయి.. మా మార్కు డైలాగులు అందరికీ అలరిస్తాయి అంటున్నారు పరుచూరి బ్రదర్శ్.
ఇక చిత్రంలో రామ్ చరణ్ క్యారెక్టరేజన్ గురించి చెపుతూ... అతను యూత్ కాబట్టి దానికి తగ్గ లవ్ స్టోరీ, ఆయన ఫాదర్ కి తగ్గట్లు మాస్ స్టోరీ ఉంటుంది. అది కొత్త ప్రయోగమేమీ కాదు కానీ బాగా వర్కవుట్ అయ్యింది. సినిమా చూస్తే అర్దమవుతుంది అని చెప్పారు. ఇక బయిట నిజ జీవితంలో రామ్ చరణ్ గురించి చెపుతూ.. సినిమాలో కొదమసింహంలా ఉన్నాడతను. బయిట చాలా వినయవంతుడు. చాలా గొప్ప క్యారెక్టర్ అతనికి. గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అతను అంటూ మెచ్చుకున్నారు. అలాగే తాము రచ్చ రష్ చూసి రామ్ చరణ్, తమన్నా జంటను చూసి చాలా ముచ్చటపడ్డామని అన్నారు. రామ్ చరణ్ తో కంటిన్యూగా సినిమాలు చేస్తామని అన్నారు.


Click it and Unblock the Notifications











