twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పరుచూరి బ్రదర్స్‌ను ఊచకోత కోస్తానన్న శోభన్ బాబు:ఇన్నాళ్లకు బయటపడింది..

    |

    కథ చెప్పేటప్పుడు ఒకలా... తీరా తెర మీద చూశాక మరోలా తమ పాత్రను చూసుకోవాల్సి వచ్చిందనుకోండి. ఏ నటుడికైనా అహం దెబ్బ తినడం ఖాయం. క్యారెక్టర్ షేడ్ మారినా.. సినిమాలో దాని ప్రాధాన్యత తగ్గినా కచ్చితంగా రచయితను, దర్శకుడిని నిలదీస్తారు. ఆవేశం పట్టకపోతే నోరు జారే సందర్భాలు కూడా ఉంటాయి. అలా ఒకప్పటి సోగ్గాడు శోభన్ బాబు.. పరుచూరి బ్రదర్స్ పై ఓ మాట జారారట. అదేంటో పరుచూరి మాటల్లోనే..

     ఊచకోత కోస్తానన్న శోభన్..:

    ఊచకోత కోస్తానన్న శోభన్..:

    శోభన్ బాబు గారు చాలా సాత్వికుడు కదా.. ఆయనతో, మాకు విబేధాలేంటని చాలామంది అనుకుంటారు. 1984లో వచ్చిన 'మహాసంగ్రామం' సినిమా సమయంలో మా ఇద్దరు (పరుచూరి బ్రదర్స్) గురించి శోభన్ బాబు గారు 'ఐ విల్ మసాకర్ పరుచూరి బ్రదర్స్ (పరుచూరి బ్రదర్స్ ని ఊచకోత కోస్తా)' అన్నారు. అలా ఎందుకున్నారో కొన్నాళ్లు అర్థం కాలేదు.

    Recommended Video

    Paruchuri Gopala Krishna Shares His Opinion About Jr NTR's Jai Lava Kusa Movie.
     శోభన్ బాబు అలా అనడం వెనుక:

    శోభన్ బాబు అలా అనడం వెనుక:

    శోభన్ బాబు అంత మాట ఎందుకన్నారో మొదట్లో మాకు అర్థం కాలేదు. ఆ తర్వాత తెలిసిందేంటంటే!.. మహాసంగ్రామం సినిమా విషయంలో ఆయన మాపై ఆగ్రహంతో ఉన్నారని తెలిసింది. ఈ సినిమా గురించి చెప్పాలంటే.. మొదటగా ఈ కథను ఎన్టీఆర్ కు వినిపించాం. నిజానికి ఆయనను దృష్టిలో పెట్టుకునే ఈ కథ రాసుకున్నాం.

     ఎన్టీఆర్ ఇలా..:

    ఎన్టీఆర్ ఇలా..:

    ఎన్టీఆర్ ను కలిసి కథ కూడా చెప్పాం. కథ విన్న ఎన్టీఆర్.. 'చాలా బాగుంది బ్రదర్.. చూద్దాం' అన్నారు. ఇంత బాగున్న కథను చేద్దామని కాకుండా.. చూద్దామన్నారేంటి అనుకన్నాం. దీంతో 'అన్న గారూ! రాజకీయాల్లోకి వెళ్లిపోతున్నారా' అని అడిగాం.

     నిజాలు చెప్పొచ్చా?:

    నిజాలు చెప్పొచ్చా?:

    రాజకీయాల గురించి మేమడిగిన ప్రశ్నకు.. 'రాజకీయాల్లోకి వెళ్లే వాళ్లు నిజాలు చెప్పొచ్చా?' అని ఎన్టీఆర్ మాతో అన్నారు. దీంతో అసలు విషయం అర్థమైంది. 'చెప్పకూడదండి' అని బదులివ్వడంతో.. 'అయితే మేమూ చెప్పం' అని ముగించారు. అయితే ఇదే కథను నిర్మాత తిరుపతి రెడ్డి గారు విని.. ఒక హీరో కాకుండా ఇద్దరు హీరో క్యారెక్టర్లతో కథ తిరిగి రాయగలరా? అని అడిగారు.

     శోభన్ పాత్రకు కత్తెర.:

    శోభన్ పాత్రకు కత్తెర.:

    తిరుపతి రెడ్డి కోరిక మేరకు కథను కృష్ణ, శోభన్ బాబుల మీదకు మార్చాల్సి వచ్చింది. వాళ్లను దృష్టిలో పెట్టుకుని హీరో కథ రాశాం. సినిమా కూడా బాగానే వచ్చింది. అయితే అంత బాగా వచ్చిన సినిమాలో.. శోభన్ బాబు పాత్ర చాలావరకు ఎగిరిపోయింది. దాదాపు మూడువేల అడుగుల నిడివి గల పాత్ర ఎగిరిపోయింది.

     ఆ సీన్స్ వద్దన్నారు:

    ఆ సీన్స్ వద్దన్నారు:

    శోభన్ పాత్ర సినిమాలో మిలటరీ ఆఫీసర్. ఆయన పాత్రలో కామెడీ సీన్స్ కూడా ఉంటాయి. మిలటరీ పాత్ర కావడంతో సెన్సార్ సమయంలో ఓ ఆర్మీ ఆఫీసర్ సినిమా చూడటానికి వచ్చారు. ఆ కామెడీ సీన్స్ కు మేము అనుమతించం అని చెప్పారు. దీంతో చేసేది లేక శోభన్ బాబు పాత్రకు కత్తెర వేసేశారు.

     చివరికి సారీ చెప్పారు..:

    చివరికి సారీ చెప్పారు..:

    శోభన్ బాబు పాత్రను ట్రిమ్ చేయడంతో సహజంగానే కృష్ణ గారి వేషం తెరపై ఎక్కువ సేపు కనిపించింది. తన పాత్ర తగ్గిపోయిందని తెలిసిన శోభన్ బాబు.. 'ఐ విల్ మసాకర్ పరుచూరి బ్రదర్స్' అంటూ ఫైర్ అయ్యారట. అయితే ఆ తర్వాత రెండేళ్లకు అసలు విషయం తెలిసి తిరుపతిరెడ్డి గారికి సారీ కూడా చెప్పారు. అలా మా మధ్య విభేదాలు, ఆ తర్వాత అవి తొలగిపోవడం జరిగాయి.

    English summary
    In an interview Paruchuri Brothers revealed a clash between them and Shobhan Babu. Once upon a time Shobhan Babu warned them regarding Mahasangramam movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X