మా జీవితం, మెగాస్టార్ జీవితం ఆ సినిమాతోనే.. సోమవారం పుట్టిన కొడుకు, బీపీ రైజ్ అయ్యేలా!

Recommended Video

Paruchuri Brothers Speech @Sye Raa Narasimha Reddy Teaser Launch

ఆగష్టు 22 న మెగాస్టార్ చిరంజీవి జన్మదినం. ఒకరోజు ముందుగానే సంబరాలు మొదలైపోయాయి. భారీ అంచనాల నడుమ, వందల కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి చిత్ర టీజర్ విడుదలైంది. రోమాలు నిక్కబొడుచుకునేలా మెగాస్టార్ సైరా గెటప్ లో రౌద్రం ప్రదర్శిస్తున్నాడు. ప్రత్యేకమైన మీడియా సమావేశం నిర్వహించి సైరా చిత్ర యూనిట్ ఈ టీజర్ ని విడుదల చేశారు. ఈ చిత్రం గురించి పరుచూరి బ్రదర్స్ ఆసక్తికరమైన విశేషాలు వెల్లడించారు.

ఆ సినిమాతోనే

ఆ సినిమాతోనే

పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. మా జీవితం, మెగాస్టార్ చిరంజీవి జీవితం ఖైదీ చిత్రంతోనే ముడిపడి ఉన్నాయి. దశాబ్దాల కాలంగా మా ప్రయాణం కొనసాగుతోంది.

 నవ్వుతూ కనిపిస్తాడు

నవ్వుతూ కనిపిస్తాడు

ఈ చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి. ఆయన నవ్వుతూ కనిపిస్తారు కానీ మా వద్ద నుంచి ఆయన ఎం కావాలో అది తీసేసుకుంటారు అని పరుచూరి వెంకటేశ్వర రావు అన్నారు. రాంచరణ్ ఈ చిత్రానికి సురేందర్ రెడ్డిని దర్శకుడిగా ఎందుకు ఎంపిక చేసుకున్నాడో సినిమా చూశాక మీకే అర్థం అవుతుంది.

మా నిర్మాత

మా నిర్మాత

రాంచరణ్ మాకు నిర్మాత. రాంచరణ్ కు కోపం వస్తే అంతసులువుగా పోదు. చాలా తెలివిగలవాడు. ఎవరి మనసులో ఏముందో పసిగట్టేస్తాడు అని వెంకటేశ్వర రావు అన్నారు.

సోమవారం

సోమవారం

నేను, చిరంజీవి ఇద్దరం సోమవారమే పుట్టాం. సోమవారం పుట్టిన కొడుకు కుటుంబాన్ని పైకి తీసుకుని వస్తాడు. మెగాస్టార్ విషయంలో అదే జరిగిందని వెంకటేశ్వర రావు అన్నారు.

బీపీ రైజ్ అయ్యేలా

బీపీ రైజ్ అయ్యేలా

పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ.. భయంకరమైన యాక్సిడెంట్ చూసినా నా బీపీ పెరగలేదు. కానీ సైరా టీజర్ చూస్తుంటే బీపీ రైజ్ అయిపోతోందని పరుచూరి అన్నారు. చిరంజీవి నటన కళ్ళల్లోనే కనిపిస్తుందని గోపాల కృష్ణ అన్నారు. తాము గొప్పగా రాసిన చిత్రాలు చాలా ఉన్నాయి. కానీ సైరా చిత్రానికి పనిచేసినందుకు గర్వపడుతున్నాం అని గోపాలకృష్ణ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X