'బంగారు పళ్ళానికి గోడ ఆసరా' కృష్ణవంశీ
'మహాత్మ" సినిమా ట్రైలర్స్ ఆవిష్కరణలో సామెతలు చోటుచేసుకున్నాయి. పరచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ...'కృష్ణవంశీ దర్శకత్వంలో నేను 'సింధూరం"లో, తమ్ముడు'శశిరేఖా పరిణయం"లో నటించాం. కానీ అతని సినిమాకు రాసే అవకాశం రాలేదు. 'మహాత్మ" చిత్రం ద్వారా ఆ అవకాశం వచ్చింది. రచయితగా అతను మమ్మల్ని ఉపమూగించుకున్న విధానం చూస్తుంటే ఒక క్రూడ్ సామెత గుర్తుకొస్తోంది. 'పక్కలో పెళ్లాం-చేతిలో బెల్లం" ఉంటే ఊరుకో బుధ్ది కాదు". మా నటనను ఉపయోగించుకున్నట్లే రచయితలుగా మా సీనియారిటీని ఉపయోగించుకున్నాడు. కొన్ని సందర్బాల్లో మేము అతన్ని కన్విన్స్ చేశాం. మరి కొన్నిసార్లు ఆయన మమ్మల్ని కన్విన్స్ చేశాడు. సినిమా రష్ చూశాను. అద్భుతంగా ఉంది. సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకులు నీరాజనాలు పడతారు. కృష్ణగారికి 'అల్లూరి సీతారామరాజు" ఎలాగో...శ్రీకాంత్ కు 'మహాత్మ" అలాంటి చిత్రమవుతుంది" అన్నారు.
పరచూరి వెంకటేశ్వరరావు సామెతకు కృష్ణవంశీ స్పందిస్తూ..'బంగారు పళ్ళానికి కూడా గోడ ఆసరా కావాలి" అంటారు. నేను బంగారు పళ్లెం అని తెలుసు. ఈ చిత్రానికి పరుచూరి సోదరులు నాకు గోడలా ఆసరాగా నిలబడ్డారు. వారి అనుభవం నాకెంతో ఉపయోగపడింది." అని కృష్ణవంశీ అన్నారు.


Click it and Unblock the Notifications











