కొరటాల అదరగొట్టేశాడు.. ఆ సీనే అతడి నిజాయితీ.. పరుచూరి ప్రశంస
ప్రిన్స్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మండమైన రెస్సాన్స్ కనిపిస్తున్నది. ఈ చిత్రం రికార్డు స్థాయి కలెక్షన్లను రాబడుతున్నది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ఇప్పటికే సినిమా ప్రముఖులు తమ ప్రశంసలు గుప్పిస్తున్నారు. హీరో రాంచరణ్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఈ సినిమా గురించి తమ అభిప్రాయాలను ట్విట్టర్‌లో వెల్లడించారు. సినిమాపై అభిమానాన్ని వ్యక్తం చేసిన జాబితాలో కొత్తగా ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ చేరారు.

యూట్యూబ్‌లో పరుచూరి పలుకులు పేరుతో తన అనుభవాలను పంచుకొంటున్న పరుచూరి గోపాలకృష్ణ.. తాజాగా 'భరత్ అనే నేను' చిత్రం గురించి మాట్లాడారు. చిత్ర యూనిట్‌ను అభినందించడమే కాకుండా దర్శకుడు కొరటాల శివపై ప్రత్యేకంగా ప్రశంసించారు. భరత్ అనే నేను చిత్ర నిర్మాణంలో కమర్షియల్ అంశాలను జొప్పించేందుకు ప్రయత్నం చేయలేదు. అందుకు ఉదాహరణ జాతర ఎపిసోడ్. తెలుగు సినిమాల్లో జాతర సీన్లు వస్తే సాధారణంగా ఐటెం పాటలు పెట్టేందుకు దర్శకులు ఇష్టపడుతారు. కానీ కొరటాల శివ మాత్రం అది చేయలేదు.
ప్రేక్షకుల మూడ్‌ను ఏమాత్రం దెబ్బతీయకుండా అద్భుతమైన పాటను పెట్టి ఆసక్తి రేకెత్తించాడు. దర్శకుడు అనుసరించిన విధాంన కరెక్ట్ అని నా అభిప్రాయం. సినిమా చూసేటప్పుడు ఈ విషయాన్ని నా పక్కనే కూర్చొని చూస్తున్న మా అమ్మాయికి కూడా చెప్పాను. సినిమా చూస్తే కొరటాల నిజాయితీ ఏంటో తెలిసిపోతోందని చెప్పాను అని పరుచూరి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.


Click it and Unblock the Notifications











