For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చరణ్ కెరీర్లో మచ్చ, నాగబాబును గుల్ల చేసిన సినిమా: కారణాలు వెల్లడించిన పరుచూరి!

|

ఎన్నో విజయాలు అందుకుని రామ్ చరణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. అయితే అతడి కెరీర్లో ఎప్పటికీ మాయని మచ్చ 'ఆరెంజ్'. ఈ మూవీని నిర్మించిన కారణంగా నాగబాబు ఇల్లు గుల్ల చేసుకుని తీవ్రంగా నష్టపోయాడు, అప్పుల పాలయ్యాడు. ఆ రేంజిలో ఈ చిత్రం డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.

'పరుచూరి పలుకులు' పేరుతో సినిమా పాఠాలు చెబుతున్న ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ 'ఆరెంజ్' లెవంత్ అవర్ గురించి మాట్లాడారు. ఆ సినిమా అంత పెద్ద ప్లాప్ అవ్వడానికి కారణం ఏమిటో వివరించే ప్రయత్నం చేశారు. ఆయన ఈ సినిమా గురించి చెప్పిన విశ్లేషణ క్రింది విధంగా ఉంది.

ఇంటర్వెల్ ముందు కూడా అదే డిస్క్రషన్

ఆరెంజ్ కథ ఒకే రేంజిలో వెళింది. ఓపెనింగులో ఎక్కడ కథ మొదలైందో... ఇంటర్వెల్ ముందు కూడా అదే డిస్క్రషన్ సాగింది. ‘కొంత కాలం మాత్రమే ప్రేమిస్తా.. లైఫ్ లాంగ్ ప్రేమించలేను' పాయింట్ చుట్టే తిరిగింది.

ఆసక్తి ప్రేక్షకుడిలో కలిగిస్తూ తీసుకెళ్లాలనుకున్నాడు, కానీ...

ఉత్తమ పురుష దృష్టి కోణంలో ఈ కథ ప్రకాష్ రాజ్‌కు రామ్ చరణ్ నేరేట్ చేసాడు. కాబట్టి ఒక ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి అక్కడక్కడ బ్రేక్ ఇచ్చుంటూ దర్శకుడు భాస్కర్ ‘నెక్ట్స్ ఏం చెప్పబోతున్నాము' అనే ఆసక్తి ప్రేక్షకుడిలో కలిగిస్తూ తీసుకెళ్లాలనుకున్నాడు.

వాస్తవానికి దగ్గరగా లేదు

ఇదే దర్శకుడు చేసిన బొమ్మరిల్లు ట్రూ స్టోరీ. ఎందుకంటే చాలా మంది పిల్లలు వాళ్ల నాన్నల్ని మీరు బొమ్మరిల్లు ఫాదర్ లాగా ఉన్నారనే ఫీలింగుకు వచ్చారు. బొమ్మరిల్లు ఫాదర్ అనేది స్టాంప్ అయింది సమాజంలో.. అంత వాస్తవానికి దగ్గరగా తీసుకెళ్లాడు. కానీ ఆరెంజ్ కథ.. ‘ఈ ముగ్గురిలో నేను ఎవరిని లవ్ చేయాలి అని చీటీ తీసే హీరోయిన్ క్యారెక్టర్. 9 మందిని ప్రేమించి వదిలేశాడు అనే పాయింటుతో హీరో క్యారెక్టర్ మొదలు పెట్టాడు.... ఇది వాస్తవానికి దగ్గరగా లేదు.

అలాంటి క్యారెక్టర్లోకి ఎలా కనెక్ట్ అవుతారు?

సినిమాలో యూత్ వచ్చి కూర్చుంటారు. ప్రేక్షకులు ఆ హీరో క్యారక్టర్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఎవరిని ప్రేమిద్దామనే డైలమాలో ఉన్న హీరోయిన్ క్యారెక్టర్లోకి అమ్మాయి ఎవరైనా వెళ్లగలరా? ఆల్రెడీ 9 మందిని ప్రేమించి వదిలేశాడు అనే అబ్బాయిని కరెక్ట్ అనే ఫీలింగ్ వారికి వస్తుందా?

అలా చేస్తే బెటర్‌గా కనెక్ట్ అయ్యేది

గంట యాభై నిమిషాల తర్వాత అక్కడ ఎందుకు హీరో ఇలా బిహేవ్ చేస్తున్నాడనే అంశంతో 24 నిమిషాల ఫ్లాష్ బ్యాక్ పెట్టారు. హీరో ఆ నిర్ణయానికి ఎందుకు వచ్చాడు. ఆడపిల్ల వద్ద నిర్మొహమాటంగా నేను కొంతకాలమే ప్రేమించగలను అని ఎందుకు అంటున్నాడు అనే పాయింటును ముందే చెబితే కొంత ఆయన మీద సింపథీ వచ్చేది. గతంలో హీరోను ఒక అమ్మాయి అనుమానించబట్టే వదిలేసి వచ్చాడు.. ఇలాంటి ఆడపిల్లను ప్రేమించకూడదు అనుకున్నాడు. దురదృష్ట వశాత్తు అందరూ అలాంటి వారే తగులుతున్నారు కాబట్టి వదులుకుంటూ వదులుకుంటూ ఈ(హీరోయిన్) అమ్మాయి ఎలాంటిదో పరీక్షించుకుంటున్నాడు అనేది చూసే వారికి అర్థమైతే కథ ఇంకా బెటర్ గా కనెక్ట్ అయ్యేది.

ఇది కరెక్ట్ కాదు

ఈ ఇంకో విషయం గమనిస్తే సినిమా మొత్తం ప్రేమమీద డిస్క్రషన్ జరుగుతూనే ఉంటుంది. ప్రతీ సీన్లో ప్రేమ గురించే చర్చ వస్తోంది. ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించడానికి అనువైన అంశాలు కాకుండా ప్రేమ ఏంటి? అనే చర్చే ఎక్కువ. ఇది కూడా కరెక్ట్ కాదు.

ఆ పాయింట్ చెప్పాలనుకున్నారు కానీ..

నాగబాబు పాత్ర ద్వారా మంచి ఫినిషింగ్ ఇవ్వాలనుకున్నారు. ప్రేమ త్యాగాన్ని కోరుతుంది అనే అద్భుతమైన పాయింట్ చెప్పాలనుకున్నారు. వారిద్దరినీ కలిపినపుడు కూడా ఆ విషయం రివీల్ చేయలేదు. కానీ చివర్లో హీరో అదే చేశాడు. గ్రాఫిటీ అనే తనకు ఇష్టమైన హాబీ త్యాగం చేసి ఉద్యోగం చేయమంటే నేను మానేయను అంటాడు. ఆ తర్వాత దాన్ని వదిలేశాడనుకోండి.

అలా చేస్తే బావుండేది

హీరోయిన్ వచ్చి 3వేల డాలర్లకు ఉద్యోగం చేయాలని అడిగినపుడు ఒక సీన్ ఉంది. తల్లిని అడుగుతుంది.. నాన్నగారు నువ్వు ఇంకా ప్రేమించుకోవడం లేదా? జీవితాంతం మీరు ప్రేమలో లేరా? అని అడిగితే ఆ తల్లి తలవంచుకుంటుంది. అంటే ఈ విడకు అర్థమైపోయింది. కానీ ఆ తర్వాత వచ్చి మళ్లీ నన్ను లైఫ్ లాంగ్ ప్రేమిస్తావా? లేదా? అని కండీషన్ కంపెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే తల్లిదగ్గర ఒక విషయం విన్నది అంటే ఆ అమ్మాయి రియలైజ్ అయ్యి.. నా లైఫ్ లాంగ్ అక్కర్లేదు, కొంతకాలమే ప్రేమించు, కానీ ఈ ఉద్యోగం చేయి... దీన్ని వదులు అంటే నేను వదలను అని హీరో అన్నపుడు మీరు కథను ముందుకు నడుపుకోవచ్చు..ఆ తర్వాత వదిలాడు కాబట్టి హీరోయిన్ వెళ్లింది అని చూపించవచ్చు.

అలా చెబితే యువతకు నచ్చదు

ఫండమెంటల్‌గా ఈ సినిమా యువతకు నచ్చాలి. వారికి ఎందుకు నచ్చలేదంటే.. ప్రేమ అబద్దం, అబద్దాలు చెప్పే అమ్మాయిలను పడేస్తారు అన్నట్లు చూపించారు. ప్రేమ అబద్దం అంటే యువతకు నచ్చదు, కొంతకాలం ప్రేమ అన్నా కూడా నచ్చదు. ఆరెంజ్ మూవీ ప్రేమ డెఫినిషన్ మీద చర్చలాగా వెళ్లిందే తప్ప... ప్రేమను పంచడించే దిశగా వెళ్లలేదు. ప్రేమ అబద్దం, నిజమైన ప్రేమ ప్రపంచంలో ఉండదు. ఎవరైనా ప్రపంచంలో రెండు అబద్దాలు చెప్పి ఉండాల్సిందే అనే విధంగా కథ సాగింది.

లవ్ గురించి చర్చ చేస్తూ వెళ్లడం వల్ల కనెక్టివిటీ పోయింది

నాగబాబు, ఆయన భార్య రోజూ పోట్లాడుకుంటారు.. కానీ వారి మధ్య ప్రేమ ఉంది. అదే లైఫ్ లాంగ్ ప్రేమ అంటే.. అది చూపించి కూడా భాస్కర్ కనెక్ట్ చేయలేక పోయాడు. లవ్ గురించి చర్చ చేస్తూ వెళ్లడం వల్ల కనెక్టివిటీ పోయింది. ఆ కనెక్ట్ విటీ డెవలప్ చేసుకుంటూ వెళితే ‘ఆరెంజ్' మరో లెవల్ వెళ్లేది అని... పరుచూరి వివరించారు.

English summary
Paruchuri Gopala Krishna About Ram Charan's Orange Movie 11th Hour. In Today's Paruchuri Paataalu, Lesson 63 Paruchuri Gopala Krishna Talks About Story of Orange Movie. He Says that Orange Movie Story Revolves Around the Line of Love.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more