రాజా ది గ్రేట్, ఒక్కడు ఒకేలా.. ఎఫ్2 చిత్రంతో అనిల్ చీట్ చేశాడు!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఎఫ్2 చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బ్లస్టర్ హిట్ గా నిలిచింది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ వినోదాత్మకపు చిత్రానికి ఆడియన్స్ ఫిదా అయ్యారు. తమన్నా, మెహ్రీన్ కౌర్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. చాలా కాలం తర్వాత వెంకీ తనదైన శైలిలో కామెడీ పండించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఎఫ్2 కోసం క్యూ కట్టారు. ఎఫ్2 విజయం గురించి మాట్లాడుతూ ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

వరుసగా విజయాలు
యువ దర్శకుడు అనిల్ రావిపూడి వరుసగా విజయాలు సాధిస్తున్నాడు అని పరుచూరి అన్నారు. అనిల్ చిత్రాలని గమనిస్తే పాత చిత్రాలని కొన్నింటికి ప్రేరణగా పొంది ఈ చిత్రాలని తెరకెక్కించినట్లు తెలుస్తోందని అన్నారు. రామాయణం, మహాభారతం నుంచి ప్రేరణ పొందొచ్చు. అలాగే పాత కథల నుంచి కూడా ప్రేరణ పొంది ఎవరి స్టైల్ లో వాళ్ళు తీయొచ్చని పరుచూరి అన్నారు.

పాత సినిమాలతో పోలిక
అనిల్ రావిపూడి తెరకెక్కించిన రాజా ది గ్రేట్ చిత్రం పరిశీలిస్తే ఒక్కడు చిత్రం గుర్తుకు వస్తుందని అన్నారు. అలాగే ఎఫ్2 చిత్రం కూడా క్షేమంగా వెళ్లి లాభంగా రండి చిత్రం నుంచి ప్రేరణ పొంది ఉండొచ్చని అన్నారు. ఒకే కథాంశాలతో రూపొందినత మాత్రమే అవి ఒకే చిత్రాలు అయిపోవని అన్నారు. స్టేట్ రౌడీ, పోకిరి చిత్రాలు ఒకే కథాంశంతో కూడుకున్నవి అని అన్నారు.

అనిల్ చీట్ చేశాడు
ఇక ఎఫ్2 చిత్రంలో అనిల్ రావిపూడి సెకండ్ హాఫ్ తో ఆడియన్స్ ని చీట్ చేసాడు అని అన్నారు. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ లో హీరోయిన్లకు బుద్ది వస్తుందని అంతా భావిస్తారు. కానీ అనిల్ ఆడియన్స్ ని చీట్ చేసి హీరోలకు బుద్ది వచ్చేలా చేశాడని తెలిపారు. కానీ చిత్రంలో కామెడీతో అనిల్ రావిపూడి అద్భుతం చేశాడు. భార్య భర్తల నేపథ్యంలో వచ్చే చిత్రాలకు ఎప్పటికి క్రేజ్ ఉంటుందని అన్నారు. ఆ కథాంశంతో ఎన్నో చిత్రాలు వచ్చాయని పరుచూరి తెలిపారు.

ఆ క్రెడిట్ అనిల్ రావిపూడిదే
ప్రస్తుత రోజుల్లో ఆడవాళ్లు టీవీలకు అతుక్కుపోయి థియేటర్స్ లో సినిమా చూసేందుకు రావడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ఎఫ్ 2 చిత్రం కోసం మహిళలంతా థియేటర్స్ కు వచ్చారని అన్నారు. ఆ క్రెడిట్ అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజుకు దక్కుతుంది అని తెలిపారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఎఫ్2 చిత్రం 80 కోట్లకు పైగా షేర్ సాధించి అద్భుత విజయాన్ని అందుకుంది.


Click it and Unblock the Notifications











