twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    "ఎన్టీఆర్ ఫ్యాన్ అయుండి ఆయన చేతిలో చావడమేంటన్నారు"

    ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తాజాగా ఏఎన్ఆర్ గురించిన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

    By Bojja Kumar
    |

    'పరుచూరి పలుకులు' పేరుతో తన సినీ ప్రస్థానంలోని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్న ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తాజాగా ఏఎన్ఆర్ గురించిన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

    Recommended Video

    Paruchuri Gopala Krishna Shares His Opinion About Jr NTR's Jai Lava Kusa Movie.

    నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమా పరిశ్రమకు రెండు కళ్ల లాంటి వారు అని, తాను సినిమాల్లోకి రాక ముందే నాగేశ్వరరావుగారు తనకు తెలుసని, తాను అన్న ఎన్టీఆర్ అభిమానిని అయినప్పటికీ.... నేను చూసిన మొదటి నటుడు అక్కినేని నాగేశ్వరరావుగారే అని గోపాలకృష్ణ తెలిపారు.

     తొలిసారిగా అపుడు చూశాను

    తొలిసారిగా అపుడు చూశాను

    1959 నుండి 1964 వరకు మేము నూజివీడులో కండ్రికతోటలో ఉండేవారం. అడుసుమిల్లి విశ్వేశ్వరరావుగారి తోటలో 50 ఎకరాల పొలాన్ని అక్కినేని నాగేశ్వరరావు కొనుక్కున్నారు. ఆ సమయంలో నేను చాలా చిన్న పిల్లాన్ని. అక్కినేనిగారు ఆ పొలంలో 555 సిగరెట్ ప్యాకెట్ పట్టుకుని నడుచుకుంటూ వస్తుంటే చూశానని, అలా తన జీవితంలో నేను ఫస్ట్ చూసింది అక్కినేని నాగేశ్వరరావుగారి అని పరుచూరి తెలిపారు.

    అక్కినేనితో సినీ జ్ఞాపకాలు

    అక్కినేనితో సినీ జ్ఞాపకాలు

    రచయిత అయిన తర్వాత అక్కినేని నాగేశ్వరరావుతో గురుబ్రహ్మ, బ్రహ్మరుద్రులు, అగ్నిపుత్రుడు లాంటి సినిమాలకు పని చేశాము. గురుబ్రహ్మలో, బ్రహ్మరుద్రుడులో ఆయనతో కలిసి నటించాను. బ్రహ్మరుద్రుడులో ఆయనకు విలన్ గా నటించాను. అప్పటికే ప్రతిధ్వనిలో నేను చేసిన పాత్రకు విపరీతమైన పేరు వచ్చేసరికి.... నేను వేయను అని చెప్పినా మురళీ మోహన్ రావు, అశ్వినీదత్ గారు నాతో ఆ విలన్ వేషం వేయించారు అని పరుచూరి తెలిపారు.

    ఎన్టీఆర్ ఫ్యాన్ అయుండి ఆయన చేతిలో చావడమేంటన్నారు

    ఎన్టీఆర్ ఫ్యాన్ అయుండి ఆయన చేతిలో చావడమేంటన్నారు

    బ్రహ్మరుద్రుడులో అక్కినేని నాగేశ్వరరావు గారు నా పాత్రను కాల్చి చంపేసే షాట్ తీస్తున్నారు. అపుడు మొహంజాహీ మార్కెట్ వద్ద సంపూర్ణ హోటల్ వద్ద షూటింగ్ జరుగుతోంది. దాదాపు వెయ్యి పదిహేను వందల మంది ఆ షూటింగ్ చూడటానికి వచ్చారు. షూటింగులో భాగంగా నాగేశ్వరరావు నన్ను కాల్చిన తర్వాత నేను ఆ రక్తం తుడుచుకుని అలా కూర్చున్నాను. అపుడు కొంత మంది నా చుట్టూ చేరారు. అందులో ఒకరు ‘పైసల్లేక చస్తున్నావా అన్నా?' అన్నారు. పైసల్లేక చావటం ఏమిటి? నాకు అర్థం కాలేదు. పైసల్లేక చచ్చిపోవడం ఏమిటయ్యా అన్నాను! నువ్వు ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెబుతావ్. ఏఎన్ఆర్ చేతిలో ఎట్లా చచ్చిపోతవ్ అన్నారు. నాకు వెంటనే నవ్వొచ్చింది. ఫెనిటిజమ్ ఆఫ్ ఫ్యాన్స్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ జ్ఞాపకాన్ని గుర్తు చేస్తున్నాను. అంటే అక్కినేని నాగేశ్వరావు చేతిలో ఎన్టీ రామారావు ఫ్యాన్ గా ముద్ర పడిపోయిన నేను(ఆ పాత్ర) చనిపోవడానికి వీల్లేదు. అది వాళ్ల కోరిక, అభిమానుల హృదయం అలా ఉంటుంది.... అని పరుచూరి గోపాలకృష్ణ గుర్తు చేసుకున్నారు.

     ఆ విషయం గురించి మళ్లీ మళ్లీ ప్రశ్నించారు

    ఆ విషయం గురించి మళ్లీ మళ్లీ ప్రశ్నించారు

    అన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓసారి వివేకానందుడి గెటప్ వేశారు. అపుడు నేను నాగేశ్వరరావు గారితో ఓ షూటింగ్ చేస్తున్నాం. అపుడు నాగేశ్వరరావుగారు ఎందుకు మీ అన్నగారు ఈ గెటప్ వేశారు అన్నారు. సార్ వాళ్లేదో పొలిటికల్ లీడర్లు, మనకెందుకు సార్ మన పని మనం చేసుకుందాం అన్నాను. కాదు కాదు మీకు తెలుసు... ఎందుకు వేశారో చెప్పవా? అని మళ్లీ మళ్లీ ప్రశ్నించారు అని.... పరుచూరి గుర్తు చేసుకున్నారు.

     నాగేశ్వరరావు గారికి కవ్వించడం అంటే భలే ఇష్టం

    నాగేశ్వరరావు గారికి కవ్వించడం అంటే భలే ఇష్టం

    నాగేశ్వరరావు గారికి కవ్వించడం అంటే భలే ఇష్టం, ఎంతో అద్భుంగా కవ్విస్తారు, ఈడేం మాట్లాడతారో చూడాలని కవ్విస్తారు. ఏమో సార్.. ఇందిరాగాంధీ గారు కూడా నాయక్‌ల వేషాలు, ఆ డ్రెస్సులు వేస్తుంటారు. అదంతా పొలిటికల్ గేమ్ లో భాగం సార్ అని నేను సమాధానం చెప్పాను. నేను చెప్పిన దాంతో నాగేశ్వరరావు గారు సంతృప్తి పడలేదు. నేను ఆన్సర్ చెప్పేదాకా ఆయన నన్ను వదిలి పెట్టలేదు. నేను వెంటనే ఆ గెటప్ వేయడం వల్ల పబ్లిసిటీ వస్తుందని అన్నాను. ఎక్కడొస్తుంది పబ్లిసిటీ? అని ఆయన ఎదురు ప్రశ్నించారు. సార్ 35 సంవత్సారాలుగా మీరు, ఆయన నువ్వా? నేనా? అన్నట్లుగా పోరాడుతూ వచ్చారు కదా, అలాంటి మీరు షాట్ ఆపి మరీ ఇంట్రెస్టింగ్ గా కనుక్కోవాలని చూస్తున్నారంటే... కామన్ మ్యాన్ కు ఎంత ఆసక్తి వస్తుంది అన్నాను. దాంతో ఆయన యువర్ రైట్ అని వదిలేశారు.... అని పరుచూరి గుర్తు చేసుకున్నారు.

    English summary
    Paruchuri Gopala Krishna about his Attachment with ANR. In today's Paruchui Palukulu video, Paruchuri Talks about his journey with ANR and the Movies which he worked with ANR.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X