twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆయన మాట వింటే మా వాడు బ్రతికేవాడేమో : పరుచూరి గోపాలకృష్ణ

    By Bojja Kumar
    |

    'పరుచూరి పలుకులు' పేరుతో సినీ పరిశ్రమలోని ప్రముఖులతో తన అనుభవాల గురించి చెప్పే ప్రముఖ రచయిత పరచూరి గోపాలకృష్ణ తాజాగా నట విరాట్ రావుగోపాల్ రావు గురించి ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గోపాల్ రావు అద్భుతమైన నటుడు అని, తనకు ఎంతో ఆత్మీయుడని, మా ఇంటి నుండి వచ్చే భోజనం ఎంతగానో ఇష్టపడే వారని గుర్తు చేసుకున్నారు. మా అన్నయ్య కొడుక్కి బ్లడ్ క్యాన్సర్ వచ్చినపుడు ఆయన ఒక సలహా ఇచ్చారని, ఆ సలహా విని ఉంటే మా బాబు బ్రతికేవాడేమో అని అన్నారు.

    మా అనయ్య కొడుక్కి బ్లడ్ కేన్సర్

    మా అనయ్య కొడుక్కి బ్లడ్ కేన్సర్

    1989లో మా అన్నయ్య వెంకటేశ్వరరావు గారి రెండో అబ్బాయికి బ్లడ్ కేన్సర్ వచ్చింది. అపోలో ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ చేయించి ఇంటికి తీసుకొచ్చాం. నెల రోజుల వరకు అబ్బాయి రూములోకి ఎవరూ వెళ్లొద్దు, ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది, ఒకరు మాత్రమే వెళ్లి భోజనం పెట్టి రావాలని చెప్పారు. ఈ విషయాన్ని సెట్లో రావు గోపాల్ రావుగారు విని ఓ సలహా ఇచ్చారు.

    ఆయన సలహా వినలేదనే బాధ ఇప్పటికీ ఉంది

    ఆయన సలహా వినలేదనే బాధ ఇప్పటికీ ఉంది

    తూర్పుగోదావరి జిల్లాలోని ఒక వ్యక్తికి ఇలాగే జబ్బు వస్తే కేరళకు తీసుకెళ్లి వైద్యం చేయించారని, ఆ తర్వాత 36 సంవత్సరాలు బతికాడనీ... మీ వాడిని కూడా తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. ఈ విషయం మా అన్నయ్య, వదినలకు చెబితే వారు ఏదైనా జరుగుతుందేమో అని భయపడి పంపలేదు. తర్వాత ఆ బిడ్డ చనిపోయాడు. రావుగోపాల్ రావుగారి సలహా వినిఉంటే బావుండేదని మాకు ఇప్పటికీ ఆ బాధ వెంటాడుతూ ఉంటుంది... అని పరుచూరి గోపాలకృష్ణ గుర్తు చేసుకున్నారు.

     రావు రమేష్ వేషాల కోసం...

    రావు రమేష్ వేషాల కోసం...

    రావు గోపాల్ రావు చనిపోయిన తర్వాత రావు రమేశ్‌, వాళ్ల అమ్మ మా ఇంటికిచ్చారు. బాబుకి ఏమైనా వేషాలు చెప్పండి అన్నారు. ఆమె అలా అడగ్గానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. రావు రమేష్ గురించి చాలా మందికి చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు అని పరుచూరి గోపాలకృష్ణ గుర్తుచేసుకున్నారు.

    అపుడు అరవాలనిపించింది

    అపుడు అరవాలనిపించింది

    అతడి నటన ‘గమ్యం'లో చూసిన తర్వాత నాకు అరవాలనిపించింది. ఇంత మంచి నటుడి గురించి మీరందరూ అర్థం చేసుకోలేదని చెప్పాలనిపించింది. ఇపుడు ఆయన లేని సినిమా లేదు. ఇండస్ట్రీలో మనం చెబుతుంటే అదేదో మన రికమండేషన్ అనుకుంటారు. మీ నాన్న నీలో కనపడుతున్నాడయ్యా... నువ్వు మళ్లీ అంత నటుడివి అవుతానని చెప్పాను, అంటి నటుడు అయ్యాడు అని పరుచూరి గుర్తు చేసుకున్నారు.

    English summary
    Paruchuri Gopala Krishna About His Experience With Actor Rao Gopal Rao. In Today's Paruchuri Palukulu, Paruchuri Gopala Krishna Talks About Legendary Actor Rao Gopal Rao And Also About his son Rao Ramesh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X