»   » ‘జై లవ కుశ’ అలా ఉంటే బావుండేదేమో? పరుచూరి కామెంట్

‘జై లవ కుశ’ అలా ఉంటే బావుండేదేమో? పరుచూరి కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Paruchuri Gopala Krishna Shares His Opinion About Jr NTR's Jai Lava Kusa Movie.

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన 'జై లవ కుశ' సినిమా విడుదలై బాక్సాఫీసు వద్ద హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కొన్ని రివ్యూలు మాత్రం నెగెటివ్ గా వచ్చాయి. దీనిపై ఎన్టీఆర్ ఆ మధ్య సక్సెస్ మీట్‌లో రివ్యూ రైటర్ల మీద అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ 'జై లవ కుశ' మీద అభిప్రాయాన్ని వెల్లడించారు. సినిమాపై కొందరు రాసిన నెగెటివ్ రివ్యూలపై కూడా స్పందించారు. గతంలో కొన్ని హిట్ సినిమాల విషయంలో చోటు చేసుకున్న సంఘటనలను గుర్తు చేసుకున్నారు.

ప్రేక్షకులకు నచ్చడమే ముఖ్యం

ప్రేక్షకులకు నచ్చడమే ముఖ్యం

‘ఖైదీ' ఎంత అద్భుతమైన చరిత్ర సృష్టించిందో, ఎంత మంది జీవితాలను మలుపు తిప్పిందో అందరికీ తెలుసు. కానీ ఆ చిత్రం విడుదలైనపుడు ఒక పత్రికలో ‘ద్వితీయార్ధంలో అడవిపాలైన ఖైదీ' అని నెగెటివ్ గా రాశారు. కానీ రోజు రోజుకు ఆ సినిమా ఆకాశపు అంచులను తాకేసి పెద్ద హిట్టయింది. ఎంఎస్ రెడ్డిగారికి ‘పల్నాటి సింహం' 20వ సినిమా. అంతకు ముందు 19 సినిమాలు ఆయన పెద్ద పెద్ద హీరోలతో చేశారు. ఆ సినిమాలేవీ ఆడలేదు. 20వ సినిమా విజయవంతం అయినపుడు 20 ఏళ్ల నుండి తాను ఎదురు చూస్తున్న విజయం ఈ చిత్రం అందించిందని సంతోషపడ్డారు. కానీ ఓ పత్రికలో ‘కత్తి పట్టబోయి సుత్తి కొట్టిన పల్నాటి సింహం' అని రాశారు. కథ ప్రేక్షకుడికి నచ్చిందా అనేదే ముఖ్యం. ప్రేక్షకుకి నచ్చితే ఎవరూ ఆపలేరు. ప్రేక్షకుడికి నచ్చక పోతే ఎవరూ ఆడించలేరు. ప్రేక్షకులకు నచ్చింది కాబట్టే ‘జై లవ కుశ' పెద్ద హిట్టయింది. ఇందులో మూడు పాత్రలు చేసిన జూనియర్ కు హాట్సాఫ్ అని.... పరచూరి తెలిపారు.


అలా ఉంటే బావుండేది

అలా ఉంటే బావుండేది

‘జై లవ కుశ' చిత్రంలో ఎన్టీఆర్ నటన ఎన్నటికీ గుర్తుండి పోతుందని చెప్పిన పరుచూరి క్లయిమాక్స్ లో "నేననేది అబద్ధం.. మ.. మ.. మనం అనేదే నిజం. నాకోసం చచ్చిపోదామని కూడా మీరు అనుకున్నారని తెలిసిన తర్వాత కూడా నేనేలా చనిపోతానురా'' అని 'జై'తో చెప్పించి, ముగ్గురు అన్నదమ్ములపై ఫ్రీజ్ చేసి సినిమాను ముగిస్తే బావుండేదేమో అని పరుచూరి అభిప్రాయ పడ్డారు.


నటనలో పెద్ద రామయ్య

నటనలో పెద్ద రామయ్య

ఎన్టీఆర్ పేరుకు మాత్రమే చిన్న రామయ్యని, నటనలో పెద్ద రామయ్యేనంటూ తనదైన శైలిలో పరుచూరి ప్రశంసలు కురిపించారు. సినిమా రివ్యూల మీద ఎన్టీఆర్ స్పందించకుండా ఉండాల్సింది అన్నారు.


నా రివ్యూ కాదు... కేవలం నా వ్యూ

నా రివ్యూ కాదు... కేవలం నా వ్యూ

ఇది తాను చెబుతున్న సినిమా రివ్యూగా ఎవరూ భావించవద్దని, ఇది కేవలం నా వ్యూ మాత్రమే అని పరుచూరి అన్నారు. సినిమా చివర్లో ముగ్గురు కలిస్తే బావుంటుందనేది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. "నేననేది అబద్ధం.. మ.. మ.. మనం అనేదే నిజం. నాకోసం చచ్చిపోదామని కూడా మీరు అనుకున్నారని తెలిసిన తర్వాత కూడా నేనేలా చనిపోతానురా'' అనే డైలాగుతో ఎండ్ అయితే బావుండేదని తన అభిప్రాయమని పరుచూరి తెలిపారు.
English summary
Paruchuri Gopala Krishna About Jr NTR Action in Jai Lava Kusa Movie. Paruchuri Talks about the Three Roles of Jr NTR in Jai Lava Kusa Telugu Movie and also praises Jr NTR's Action in the Movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu