బాబాయ్ అంటే భయం.. ఈ విషయం చెప్పలేదు అని తారక్ అన్నాడు.. పరుచూరి!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. గత కోనేళ్ళుగా ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో తెరెకెక్కిన అరవింద సమేత వీర రాఘవ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఇటీవలే ఈ చిత్ర సక్సెస్ మీట్ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు బాలయ్య ముఖ్య అతిధిగా విచ్చేసి నందమూరి అభిమానులని అలరించారు. అరవింద సమేత సక్సెస్ మీట్, బాలయ్య, ఎన్టీఆర్ మధ్య రిలేషన్ గురించి దిగ్గజ రచయిత పరుచూరి గోపాల కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Recommended Video


వాస్తవాలు తెలియకుండా
వాస్తవాలు తెలియకుండా అసత్యాలు మాట్లాడే వారిని విశ్వసించవద్దు అంటూ పరుచూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ అరవింద సమేత చిత్ర సక్సెస్ మీట్ గురించి మాట్లాడుతూ బాలయ్య లారీ డ్రైవర్, అనసూయమ్మ గారి అల్లుడు చిత్రాలని గుర్తు చేసుకున్నారు. ఆ చిత్రంలో విడుదలైన తొలి వారంలో చాలా మంది ప్రముఖులు ప్లాప్ అని ప్రచారం చేశారని, కానీ ఆ రెండు చిత్రాలు ఘన విజయం సాధించాయని పరుచూరి తెలిపారు.

అనుమానాలు పటాపంచలు
అదే విధంగా బాలయ్య, ఎన్టీఆర్ రిలేషన్ షిప్ గురించి చాలా రోజులుగా మీడియాలో, ఇటు బయట జరుగుతున్న అసత్య ప్రచారాలు అరవింద సమేత సక్సెస్ మీట్ తో పటాపంచలు అయ్యాయని పరుచూరి గోపాల కృష్ణ అన్నారు. వాస్తవాలు తెలిసేవరకు ఓ విషయం గురించి నిర్ధారణకు రావడం మంచిది కాదని అన్నారు.

బాలయ్య గురించి
తారక్, బాలయ్య మధ్య ఉన్న అనుబంధాన్ని పరుచూరి గోపాల కృష్ణ గుర్తు చేసుకున్నారు. పాలకొల్లులో అల్లరి రాముడు చిత్ర షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్ బాలయ్య గురించి ఓ విషయం చెప్పాడు. మీరు మా తాతగారిని ఎంతగా అభిమానిస్తారో.. అంతలా మా బాబాయ్ ని నేను అభిమానిస్తా అని ఎన్టీఆర్ తెలిపాడు.

బాబాయ్ అంటే భయం
ఈ విషయం మీ బాబాయ్ తో ఎప్పుడైనా చెప్పావా అని అడిగితే.. ఇంతవరకు చెప్పలేదు. బాబాయ్ అంటే నాకు భయం అని ఎన్టీఆర్ తమతో అన్నట్లు పరుచూరి ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. వెంటనే బాలయ్యని ఎన్టీఆర్ కలిసేలా అప్పట్లో తాము చొరవ తీసుకున్నాం అని పరుచూరి తెలిపారు. అంతా సంతోషంగా జరుగుతున్న సమయంలో ఇటీవల కొన్ని గాలి వార్తలు వచ్చాయని, అవి కేవలం అసత్య ప్రచారాలు అని పరుచూరి అభిప్రాయపడ్డారు.

ఎన్టీఆర్ నోటి నుంచి గొప్ప మాట
అరవింద సమేత సక్సెస్ మీట్ లో బాలయ్య గురించి ఎన్టీఆర్ ఓ గొప్ప మాట అన్నాడు. నాన్న స్థానంలో బాబాయ్ ఇక్కడకు వచ్చారు అని ఎన్టీఆర్ అన్నాడు. అది చాలా గొప్ప మాట. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ భుజాలపై బాలయ్య చేతులు వేసే సమయంలో నాకు అన్నగారు ఎన్టీఆర్ గుర్తుకు వచ్చారు అని పరుచూరి అన్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు కూడా అదేవిధంగా భుజాలపై చేతులు వేసి మాట్లాడేవారని పురుచూరి గుర్తు చేసుకున్నారు.

ముగ్గురి ముఖాల్లో విషాద ఛాయలు
విజయేత్సవ వేడుక జరుగుతున్న సమయంలో అందరూ సంతోషంగా కనిపిస్తారు. కానీ బాలయ్య, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ముఖాల్లో విషాద ఛాయలు కనిపించాయని పరుచూరి అన్నారు. హరికృష్ణ లేని లోటు ఆ వేడుకలో కనిపించింది. కానీ బాలయ్య ఆ స్థానాన్ని భర్తీ చేశారు అని పరుచూరి అభిప్రాయ పడ్డారు.

రికార్డుల వేట
అరవింద సమేత చిత్రం విడుదల రోజే రికార్డులు క్రియేట్ చేసి ఘన విజయం సాధించాలని ఆశించాం. అందుకు తగ్గట్లుగా ఈ చిత్రం వందకోట్ల వైపు దూసుకుపోతోందని పరుచూరి అన్నారు.


Click it and Unblock the Notifications











