twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొండవీటి దొంగ చిరు-శ్రీదేవీ కోసమే.. అలా కథ మార్చితే చేస్తానన్న హీరోయిన్.. పరుచూరి కామెంట్స్

    |

    తెలుగు చిత్ర సీమలో పరుచూరి బ్రదర్స్‌ది ఓ స్వర్ణయుగం. దాదాపుగా 350కిపైగా చిత్రాలకు కథ, మాటలు అందించిన దిగ్గజాలు పరుచూరి వెంకటేశ్వర రావు, పరుచూరి గోపాలకృష్ణ. తన అనుభవాన్ని, చేసిన పొరపాట్లను నేటి తరానికి చెప్పి, సినిమా రంగంలో రాణించాలనుకునే ఎంతో మందికి ఉచిత సలహాలు ఇస్తున్నారు. యూట్యూబ్ పరుచూరి పలుకులు అంటూ నాటి విశేషాలను వీడియో ద్వారా పోస్ట్ చేస్తుంటారు. తాజాగా కొండవీటి దొంగ చిత్ర విశేషాలను పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.

    కొండవీటి దొంగకు ముప్పై ఏళ్లు..

    కొండవీటి దొంగకు ముప్పై ఏళ్లు..

    కొండవీటి దొంగ విడుదలై ముప్పై ఏళ్లు అయ్యాయని అభిమానులు ఈ చిత్రం గురించి మాట్లాడవల్సిందిగా కోరారని చెప్పుకొచ్చారు. వారి విన్నపం మేరకు కొండవీటి దొంగ విశేషాలను చెబుతానని పరుచూరి గోపాలకృష్ణ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

    చిరు-శ్రీదేవీ కోసమే..

    చిరు-శ్రీదేవీ కోసమే..

    కొండవీటి దొంగ కథను చిరంజీవి-శ్రీదేవీ కోసమే రాశామని తెలిపారు. కథ చిరంజీవికి గారికి, నిర్మాతకు కూడా బాగా నచ్చిందని అన్నారు. అయితే హీరోయిన్‌గా ఎవరని అనుకుంటున్నారు అని అడిగితే శ్రీదేవీ అని చెప్పినట్టు తెలిపారు. సరే వెళ్లి అడగండని నిర్మాత అనుమతిచ్చినట్టు పేర్కొన్నారు.

    అలా మార్చితేనే..

    అలా మార్చితేనే..

    కథ విన్న శ్రీదేవీ బాగుందని కితాబిచ్చినట్టు తెలిపారు. టైటిల్‌ను కొండవీటి రాణి, కొండవీటి దొంగ అని మార్చాలని, కథలో హీరోయిన్ కాకుండా హీరోనే తన వెంట పడేట్టుగా కథ మారిస్తే చేస్తానని అన్నట్లు చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని నిర్మాతకు చెబితే.. కథను మార్చొద్దు, ఆయన స్టార్ హీరో.. హీరోయిన్ వెనకపడితే కథ చెడిపోతుందని, హీరోయిన్‌ను మార్చేయమని చెప్పినట్టు వెల్లడించారు.

    Recommended Video

    Prabhas Spotted At Hyderabad Airport With Coronavirus Mask
    అదే ఇప్పటి కొండవీటి దొంగ..

    అదే ఇప్పటి కొండవీటి దొంగ..

    అలా శ్రీదేవీ కండీషన్స్ పెట్టడంతో కథ అంతా మారిపోయిందని తెలిపారు. ఆ కథలో అమ్మ పాత్రకు శారద, డాక్టర్ పాత్రలో రాధ, పోలీసాఫీసర్‌గా విజయశాంతి వచ్చి చేరారని తెలిపారు. కొండవీటి దొంగ విడుదలై నేటికి మూడు దశాబ్దాలయ్యాయని వినగానే చిరంజీవి గురించి చెప్పాలనిపించిందన్నారు.

    English summary
    Paruchuri Gopala Krishna About Kondaveeti Donga Movie. First Thsi Script Made For Chiranjeevi And Sri Devi Only. After Rejecting Sri Devi Vijayashanthi And radha Came Om Board.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X