బ్లాక్ బస్టర్ ‘మహర్షి’లో దోషాలు ఎత్తి చూపిన పరుచూరి... ఆ మూడు సినిమాలు ఇందులో!

'మహర్షి' సినిమా బాక్సాఫీసు వద్ద రూ. 100 కోట్లకుపైగా షేర్ వసూలు చేసి సంచలన విజయం అందుకుంది. అయితే సినిమా ఎంత పెద్ద హిట్టయినా అందులో కొన్ని లోపాలు ఉంటాయంటూ 11 అవర్‌లో ఈ చిత్రంలోని లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ.

'మహర్షి' చూడగానే ఈ సినిమా లెంత్ కొంచెం ఎక్కువైందని అనిపించింది. గతంలో 'ఇంద్ర' సినిమా చూసిన తర్వాత నేను మౌనంగా ఉంటే చిరంజీవిగారు వెంటనే రియాక్ట్ అయి... ఏమిటి చిన్నబ్బాయ్ అలా ఉన్నారు, సినిమా బాలేదా? అని అడిగారు. బావుందండీ.. కానీ అన్నాను. కానీ ఏమిటీ అనడంతో... లెంత్ ఎక్కువైంది అన్నాను. లెంత్ ఎక్కువగా ఉండటం వల్ల సినిమా ఎంతో కొంత నష్టపోయే అవకాశం ఉండటంతో నేరుగా ఎడిటింగ్ రూముకు తీసుకెళ్లి ఒక్క సీన్ కూడా తీసేయకుండా ఫ్రేములు కట్ చేసుకుంటూ వెయ్యి ఫీట్లు తీసేశామని... పరుచూరి గుర్తు చేసుకున్నారు.

ఆ జాగ్రత్త దిల్ రాజు, వంశీ తీసుకుని ఉంటే....

ఆ జాగ్రత్త దిల్ రాజు, వంశీ తీసుకుని ఉంటే....

ఆ జాగ్రత్త దిల్ రాజు, వంశీ తీసుకుని ఉంటే ‘మహర్షి'లో నుంచి కూడా పది నుంచి పదిహేను నిమిషాల సినిమా చాలా అందంగా.. ఏమీ తీశారో తెలియకుండా తీసేయొచ్చు. మరి వారు ఈ విషయం తెలిసే వదిలేశారా? ఆల్రెడీ ఎక్కువ లెంత్ ఉంటే తీసేసి ఇక్కడి వరకు తెచ్చారో తెలియదు... అని పరుచూపి వ్యాఖ్యానించారు.

క్రైమ్ అండ్ పనిష్మెంట్ చాలా దూరం వెళ్లింది

క్రైమ్ అండ్ పనిష్మెంట్ చాలా దూరం వెళ్లింది

ఈ కథ క్రైమ్ అండ్ పనిష్మెంట్ విభాగంలోనిది. ఒక కోటీశ్వరుడి కొడుకు టాపర్ అవ్వాలనే కోరికతో ఒక క్రైమ్ చేస్తే... ఆక్రైమ్ హీరోకు అంటగట్టాలని చూస్తే... హీరోకు తెలియకుండానే స్నేహితుడు ఆ క్రైమ్ తన భుజాన వేసుకుని హీరో బయట పడేలా చేస్తాడు. హీరో ఆకాశం అంత ఎత్తు ఎదిగిన తర్వాత ఆ నిజాన్ని లెక్చరర్ ద్వారా తెలుసుకుంటాడు. ఇది చూపించిన విధానం నీ ముక్కు ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉందని నేరుగా కాకుండా ఇలా వెనక నుంచి తిరిగి చూపించినట్లుగా క్రైమ్ అండ్ పనిష్మెంట్ చాలా దూరం వెళ్లింది. డైరెక్టర్ ఇన్వాల్మెంమెంట్ రాలేదు. బాగా లేట్ అయింది.. అని పరుచూరి తెలిపారు.

ఆ దోషాలు ఉన్నాయి

ఆ దోషాలు ఉన్నాయి

ఎవరో చేసిన పాపం వల్ల తన స్నేహితుడు ఇలా అయ్యాడని హీరోకు తెలిసి రావడం క్రైమ్ అండ్ పనిష్మెంటే... కానీ ఈ పని చేయించిన ఆ కుర్రాడి తండ్రి పాత్ర అర్దాంతరంగా ముగిసిపోయింది. ఈ పని చేసిన కుర్రాడు చివర్లో సడెన్‌గా పరివర్తన పొందాడు. దానికి కూడా బలమైన కారణం కనిపించలేదు. ఈ కథలోని క్రైమ్ అండ్ పనిష్మెంటులో ఆ దోషాలు ఉన్నట్లు అనిపించిందని తెలిపారు.

అలా రెండింటినీ కలిపే ప్రయత్నం చేశాడు

అలా రెండింటినీ కలిపే ప్రయత్నం చేశాడు

ఈ సినిమాను లవ్ స్టోరీలా తీయాలనుకోలేదు. ఒక అద్భుతమైన సాఫ్ట్ వేర్ కంపెనీ తాలూకు కథగానే తీయదలుచుకుంటూ సడెన్‌గా ద్వితీయ విభాగంలోకి వచ్చేటప్పటికీ ఒక విలేజ్, పొలాలు చూపుతూ కథలోకి వెళ్లిపోయాడు. ఈ కథను మరిచిపోకూడదు కాబట్టి ఆరిజోన్ అనే కంపెనీని తీసుకొచ్చి పల్లెటూరిలో పెట్టేసి ఆరెండు కథలకు సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశాడని వెల్లడించారు.

మూడూ సినిమాలు గుర్తుకు వచ్చాయి

మూడూ సినిమాలు గుర్తుకు వచ్చాయి

ఇలా ఆ కథను విలేజ్ స్టోరీలో కలిపేసరికి చూస్తున్న ప్రేక్షకులకు మూడు సినిమాలు గుర్తుకు వచ్చాయి. ఒకటి శ్రీమంతుడు, భరత్ అనే నేను ....ఈ రెండు కూడా మహేష్ బాబు చేసినవే. ఇందులో కూడా హీరో విలేజ్‌కు వస్తాడు. ఖైదీ నెం.150 మాదిరిగా పొలాలు పోగొట్టుకున్న రైతుల తరుపున హీరో నిలబడటం. అయితే ఇందులో హీరో డైరెక్టుగా నిలబడలేదు, స్నేహితుడు నిలబడ్డాడు. అతడి యొక్క మోటివ్‌ను అతడు ఆసుపత్రి పాలయ్యాక హీరో తీసుకున్నాడు. మోటివ్ బాగా లేటయింది. సూపర్ స్టార్ సినిమాల్లో చూసిన సీన్, విన్న డైలాగ్, చూసిన కథలాగా ఎక్కడా అనిపించకూడదని.... పరుచూపి తనదైన శైలిలో విమర్శ చేశారు.

అది వాస్తవానికి దూరంగా ఉంది

అది వాస్తవానికి దూరంగా ఉంది

సినిమా అనేది వాస్తవానికి దూరంగా వెళితే బిలీవబులిటీకి దూరంగా వెళుతుంది. ఇందులో ఒక పల్లెటూరిలో చెట్టు కింద ఆరిజోన్ అనే కంపెనీ పెట్టాడు. అక్కడికి హెలికాప్టర్లలో వచ్చి కలుస్తున్నారు అనేది వాస్తవానికి దూరంగా ఉంది. ఆ కంపెనీ చెట్టు కింద కాకుండా హీరో ఫ్రెండ్ ఇంట్లో పెడితే బావుండేది. ఏది ఏమైనా ఇవన్నీ చేయకపోయినా సినిమా బావుంది. పెద్ద హిట్టయింది. ఇవన్నీ చేస్తే ఎలా ఉండేదో తెలియదు. ఏ సినిమా అయినా ఎలా ఆడుతుందో ఎవరూ చెప్పలేరు. అది కేవలం ప్రేక్షకులు మాత్రమే చెప్పగలరని.... ‘మహర్షి' మూవీపై పరుచూరి తన లెవంత్ అవర్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X