twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    '1 నేనొక్కడినే' గొప్ప కథ, దెబ్బతీసింది అదే.. నిజానికి, భ్రమకి మధ్య.. పరుచూరి!

    |

    సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 1 నేనొక్కడినే. 2014లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పట్లోనే భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. కానీ ఆశించిన స్థాయిలో ఈ చిత్రం విజయం సాధించలేదు. మహేష్ బాబు, కృతి సనన్ ఈ చిత్రంలో జంటగా నటించారు. ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ పరుచూరి పలుకులు పేరుతో పలు చిత్రాలపై తన విలేషనలు అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 1 నేనొక్కడినే చిత్ర లోపాలని కూడా వివరించారు.

    చివరి రెండు నిమిషాల్లో

    చివరి రెండు నిమిషాల్లో

    1 నేనొక్కడినే చిత్రం 2.56 నిమిషాల నిడివి ఉంటుంది. ఇంత భారీ లెన్త్ ఉన్న చిత్రంలో అసలు కథని చివరి రెండు నిమిషాల్లో మాత్రమే దర్శకుడు వివరించాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా పెరగగలిగే గోల్డెన్ రైస్ ఆలోచన హీరో తండ్రికి వస్తుంది. తన తండ్రి ఆశయాన్ని తనయుడు నెరవేరుస్తాడు. 1 నేనొక్కడినే చిత్రంలో అసలు కథ ఇదే.

    అంతగా ఎక్కలేదు

    అంతగా ఎక్కలేదు

    నిడివి చాలా ఉంది కాబట్టి చివరకు వచ్చే సమయానికి ప్రేక్షకులు సినిమా మూడ్ నుంచి బయటకు వచ్చేసి ఉంటారు. ఆ సమయంలో అసలు కథ చెప్పడం మంచిది కాదు. చిత్రంలోని అసలు పాయింట్ ని ముందుగానే వివరించాల్సింది. సినిమా ఆరంభంలోనే కథ చెప్పి ప్రారంభించి ఉంటే చివరి వరకు ఏం జ్ జరుగుతుందో అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఉండేది.

    మరో ప్రధాన లోపం

    మరో ప్రధాన లోపం

    మహేష్ బాబు పాత్ర నిజానికి, భ్రమకు తేడా తెలియక సతమతమవుతూ ఉంటాడు. ఆ సన్నివేశాలు ప్రేక్షకులకు గందరగోళానికి గురి చేశాయి. హీరోయిన్ తో వచ్చే సన్నివేశాలు కూడా అలాగే ఉంటాయి. ఆ సన్నివేశాలు కాస్త తగ్గించి హీరోయిన్ లవ్ సీన్స్ పెట్టి ఉంటే పరిస్థితి ఇంకాస్త బావుండేది అని పరుచూరి అన్నారు. తన అమ్మానాన్నల గురించి హీరో తెలుసుకునే సమయంలో చాలా ట్విస్టులు ఎదురవుతాయి. మరీ ఎక్కువ ట్విస్టులు ఉండడం కూడా కథకు మంచిది కాదు.

    గొప్ప ఆలోచన

    గొప్ప ఆలోచన

    మెయిన్ విలన్ చనిపోయిన తర్వాత కథని ఎక్కువసేపు నడిపించకూడదు. ఆ పొరపాటు కూడా ఈ చిత్రంలో జరిగింది. ఈ చిత్రంలో దర్శకుడు ఎంచుకున్న కథావస్తువు చాలా గొప్పది. ప్రతి మూడున్నర నిమిషాలకు ఆకలితో ఒకరు చనిపోతున్నారు. ఆకలి చావులు లేకుండా ఎలాంటి పరిస్థితుల్లో అయినా పండగలిగే గోల్డెన్ రైస్ అనే అద్భుతమైన కాన్సెప్ట్ ని దర్శకుడు సుకుమార్ ఎంచుకున్నారు. కానీ కథలో కొన్ని లోపాల వలన మంచి మెసేజ్ ప్రేక్షకుల చేరువకాలేకపోయిందని పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయ పడ్డారు.

    English summary
    Paruchuri Gopala Krishna About Mahesh Babu's 1 Nenokkadine Movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X