అనుష్క ఐరన్ లెగ్ అంటే భరించలేరు.. త్రివిక్రమ్ అలా చూపించాల్సింది కాదు!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం అతడు. ఈ చిత్రాన్ని ఇప్పటికి ఫ్యామిలీ ఆడియన్స్ టీవీలకు అతుక్కుపోయి చూస్తుంటారు. అంతాలా ఈ చిత్రం ఎంటర్టైన్ చేసింది. మహేష్, త్రిష మధ్య కెమిస్ట్రీ యువతని ఆకట్టుకుంది. అతడు చిత్రం మంచి విజయం సాధించడంతో ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన ఖలేజా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2010లో వచ్చిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. కానీ ఈ చిత్రానికి కూడా బుల్లితెరపై మంచి ఆదరణ దక్కింది. తాజాగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఖలేజా చిత్రాన్ని విశ్లేషిస్తూ ఆసక్తికర అంశాలు ప్రస్తావించారు.

ఎక్కువ సమయం కామెడీతోనే
ఖలేజా చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు రమేష్ సన్నివేశంతో సీరియస్ గా ప్రారంభించాడు. ఆ తర్వాత మహేష్ బాబు ఎక్కువ సమయం కామెడీ చేస్తూ ఉండిపోయాడు. రావు రమేష్ సన్నివేశాన్ని మొదట చూపించాల్సింది కాదని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. రావు రమేష్ సన్నివేశం తర్వాత మహేష్ అసలు కథలోకి వెళ్ళడానికి చాలా సమయం పట్టింది అని పరుచూరి అభిప్రాయపడ్డారు.

అనుష్క ఐరన్ లెగ్
మహిళలు ఎక్కువగా హీరోయిన్ పాత్రలకు తెలియకుండానే కనెక్ట్ అవుతుంటారు. అది సహజం. మగవాళ్ళు హీరోల పాత్రలకు కనెక్ట్ అవుతుంటారు. ఈ చిత్రంలో అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ నటించింది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రంలో అనుష్కని ఐరెన్ లెగ్ లేడిగా చూపించారు. దీనివలన మహిళలు అనుష్క పాత్రపై కాస్త నిరాశ చెంది ఉంటారు. అలాంటి పాత్రలో అనుష్కని చూపించాల్సింది కాదు. ఒకవేళ తప్పదు అనుకుని అనుకుంటే అనుష్క హ్యాండ్ పడడం వలన ప్రకాష్ రాజ్ చనిపోయినట్లుగా చూపించాల్సింది అని అన్నారు.

మరో అంశం
ఖలేజా చిత్రంలో నిరాశకు గురిచేసిన మరో అంశం ఉంది. సీరియస్ గా ఫైట్ సాగుతున్నప్పుడు నటుడు షఫీ మహేష్ ని ఆడు సామీ ఆడు అంటూ అరుస్తాడు. ఆ సమయంలో మహేష్ కామెడీగా డైలాగులు చెప్పడం కూడా సినిమాకు మైనస్ గా మారింది అని పరుచూరి అన్నారు. మహేష్ పాత్రని అంత సీరియస్ గా దేవుడు అని చూపిస్తూ మరోవైపు ఎగతాళి చేసే విధంగా డైలాగులు ఉండకూడదు అని అన్నారు.

అద్భుతమైన కథ
వాస్తవానికి ఖలేజా అద్భుతమైన కథ అని పరుచూరి అన్నారు. కొన్ని లోపల వలన ఖలేజా చిత్రం నిరాశపరిచింది. పైన చెప్పిన విషయాలలో త్రివిక్రమ్ జాగ్రత్త వహించి ఉంటే ఖలేజా చిత్ర ఫలితం మరోలా వేరుగా వచ్చి ఉండే అవకాశం ఉండేదని పరుచూరి అభిప్రాయ పడ్డారు.


Click it and Unblock the Notifications











