For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్పు రాలేదని అర్థమైంది, ఆ నిజం తెలిసేలా చేయాలి: పవన్ కళ్యాణ్ ఓటమిపై పరుచూరి

|

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ స్పందించారు. పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు ఎవరి పక్షాన ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది అనడానికి 1983 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలే నిదర్శమన్నారు. ఆ రెండు జిల్లాల ప్రభావం ఎన్నికల ఫలితాలపై ప్రముఖంగా ఉంటుంది. ఈ సారి కూడా అదే జరిగిందని తెలిపారు.

ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డిగారికి శుభాకాంక్షలు, 175లో 151 సీట్లు గెలవడం అంటే మామూలు విజయం కాదు. అదొక అద్భుతం. పది సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డిగారు ప్రజల మధ్యలో తిరుగుతూనే ఉన్నారు. ప్రజలను స్పందింపజేస్తూ తాను అధికారంలోకి వస్తే ఎంత గొప్ప మేలు చేస్తానో చెప్పాడు. ఆ రోజు రామారావుగారు 1983లో ప్రతి గ్రామానికీ వెళ్లిపోయి ఎలా అయితే మాట్లాడారో అలాగే ఈయన ప్రతి గామానికి వెళ్లారు కాబట్టి ఒక అవకాశం ఇవ్వాలనే అద్భుతమైన విజయం కట్టబెట్టారని పరుచూరి తెలిపారు.

ఆయన ఓటమి కలలో కూడా ఊహించలేదు

ఆయన ఓటమి కలలో కూడా ఊహించలేదు

పవన్ కళ్యాణ్ ఓటమిపై ఫ్యాన్స్ ఎంత బాధపడ్డారో తెలియదు కానీ ఆయన పార్టీ ఓడిపోవడం ఒక ఎత్తయితే.. ఆయన ఓడిపోవడం ఒకఎత్తు. కలలో కూడా ఏ అభిమాని ఊహించి ఉండరు. ఆంధ్ర ప్రజలు కూడా ఊహించి ఉండరు. ఆయన తప్పకుండా అసెంబ్లీకి వస్తారని భావించే ఉంటారు... నేను కూడా అదే భావించినట్లు పరుచూరి తెలిపారు.

అలా భావించిన లక్షల మందిలో నేనూ ఒకరిని

అలా భావించిన లక్షల మందిలో నేనూ ఒకరిని

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిందే ప్రశ్నించే హక్కును ప్రజలకు నేర్పడానికి... అనుక్షణం ఐదు సంవత్సరాలుగా ప్రజల ప్రశ్నించే హక్కు గురించి మాట్లాడుతున్న ఆయన్ను అసెంబ్లీకి ప్రశ్నించే హక్కు కోసం పంపించకపోవడం నమ్మశక్యం కాని నిజం. అప్పుడు రామారావుగారు తిరుపతి, గుడివాడ గెలిచి... తిరుపతి వదిలేసి గుడివాడ ఉంచుకున్నట్లు ఈయన భీమవరం ఉంచుకుంటారా? గాజువాక ఉంచుకుంటారా? అనే భావనలో ఉన్న కొన్ని లక్షల మందిలో నేనూ ఒకడిని అన్నారు.

ప్రజల్లో మార్పు రాలేదని అర్థమైంది

ప్రజల్లో మార్పు రాలేదని అర్థమైంది

గతంలో ఓ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా పిల్లలు ఎదురుగా ఉండి సీఎం సీఎం అరుస్తుంటే... ‘ఒకాయనేమో డబ్బులు పంచేశాడు... ఒకాయనేమో లీగల్‌గా డబ్బులు ఇచ్చేశాడు. మనం డబ్బులు పంచలేదు, ఇంకెందుకు సీఎం అని అరుస్తున్నారు' అన్నారు. అప్పటికే ఆయనకు ప్రజల్లో తాను కోరుకున్న మార్పు రాలేదని అర్థమైందని... పరుచూరి అభిప్రాయ పడ్డారు.

ఆ మార్పు తీసుకొస్తాడనే నమ్మకం ఉంది

ఆ మార్పు తీసుకొస్తాడనే నమ్మకం ఉంది

రామారావుగారి మొదటి ఎలక్షన్ నేను దగ్గరుండి చూశాను. ఈ రోజు పవన్ కళ్యాణ్ ఏమి కోరుకున్నాడో అది ఆ రోజు జరిగింది. అలాగే మొన్న కేజ్రీ వాల్ గెలిచాడు. కానీ ఇక్కడ మనకు ఆ మార్పు రాలేదు, కానీ తీసుకురావాలి... పవన్ తీసుకొస్తాడనే నమ్మకం ఉందని తెలిపారు.

ఈ నిజాన్ని పవన్ కళ్యాణ్ వీధి వీధికి ఇంటి ఇంటికి తెలిసేలా చేస్తే...

ఓటు వేయడానికి వచ్చినపుడు ఏం చేశావని చూపుడు వేలు చూపిస్తే... గొప్ప రాజ్యం వస్తుంది, ఏమిస్తావని అరచేయి చూపిస్తే చాలా ప్రమాదం ఏర్పడుతుంది. ఈ నిజాన్ని పవన్ కళ్యాణ్ వీధి వీధికి ఇంటి ఇంటికి తెలిసేలా చేస్తే ఒక అద్భుతాన్ని సృష్టించగలడని విశ్వసిస్తున్నాను... అని పరుచూరి గోపాలకృష్ణ వ్యాఖ్యానించారు.

English summary
Paruchuri Gopala Krishna About Pawan Kalyan's Failure In AP Elections 2019. In Today's Paruchuri Palukulu, Tollywood Senior Cine Writer Shri. Paruchuri Gopala Krishna talks about Janasena Party Chief Pawan Kalyan's defeat in AP Elections 2019. He also talks about Senior NTR & Pawan Kalyan Political Journeys.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more