twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అది వద్దనుకున్నావ్, పవన్ కళ్యాణ్... ఆ పదం వాడొద్దు, అదే రాక్షస రాజకీయం: పరుచూరి

    |

    ప్రముఖ తెలుగు సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ 'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌కు భగవంతుడు ఒక బంగారు తివాచీ వేసి దీనిపై నడుచుకుంటూ వెళ్లు నాయనా అంటే వెళ్లకుండా పక్కకు వచ్చి జనం కోసం ముల్లు గుచ్చుకుంటాయా? రాళ్లు ఎదురు దెబ్బకొడతాయా? అని ఆలోచించకుండా ముందుకు సాగుతుననారు. ఇది చాలా హృదయం ఉన్నవారు తప్ప మరొకరు చేయలేని పని అని వ్యాఖ్యానించారు.

    ఆ మూడు పదాలు వాడారు

    ఆ మూడు పదాలు వాడారు

    మొన్న ఒక మీటింగులో పవన్ కళ్యాణ్ ఆవేదన పూర్వకంగా ఓ ఇష్యూ గురించి గుర్తు చేస్తూ మూడు పదాలు వాడారు. బాధేస్తోంది, భయం వేస్తోంది.. విసుగొస్తోంది అన్నారు. ఈ మూడు పదాల గురించి అభిమానులకు వివరించాలనుకుంటున్నాను.

    బాధ, భయం ఒకే...

    బాధ, భయం ఒకే...

    ఎదుటివాడు ఎక్కడ బాధపడతాడో? ఎక్కడ నష్టపోతాడో అని బాధపడే లక్షణం ఉంటుందో అదే కామ్రేడ్ లక్షణం. అందుకే ఆయన జెండాలో ఎరుపు పెట్టుకున్నాడు. భయం వేస్తోందనే పదం చాలా గొప్పది. ఎంతో ఎదిగిన నాయకుడికి తప్ప ఆ ఆలోచన రాదు. తనకు ఏమవుతుందో అనే భయం కాదు.. ఈ జనం ఏమైపోతారో అనే భయం.

    ఆ పదం మాత్రం వాడొద్దు, అదే రాక్షస రాజకీయం

    ఆ పదం మాత్రం వాడొద్దు, అదే రాక్షస రాజకీయం

    పవన్ కళ్యాణ్ విసుగొస్తుందనే పదం వాడొద్దు. ఎందుకంటే విసుగొచ్చేలా చేయడమే రాజకీయం. అదే రాక్షస రాజకీయ లక్షణం. ఇలాంటి ప్రయత్నాలు చాలా మంది చేస్తారు. ఆ పదం మాత్రం వద్దు. బాధ ఉండాలి, భయం ఉండాలి. ఆ రెండు ఉన్నంతకాలం ఒక అద్భుతమైన ఎదుగుదల నాయకుడిలో వస్తుంది. విసుగు అనేది నువ్వు ఎంచుకున్న మార్గంలో రానివ్వకూడదు.

    నువ్వు ఆశించి వెళ్లలేదు

    నువ్వు ఆశించి వెళ్లలేదు

    నువ్వు ప్రేమించి వెళ్లావు, ఆశించి వెళ్లలేదు. జనానికి సేవ చేయాలి అనే ప్రేమతో వెళ్లావు. నీ కోరిక నెరవేరే వరకు నువ్వు విసుగు చెందకుండా ముందుకు వెళ్లాలి. పెద్దవాడిగా, నీ గురించి, నా వ్యక్తిత్వం గురించి తెలిసిన వ్యక్తిగా, నిన్ను అభిమానించే వాడిగా.... చెబుతున్న మాట ఇది అని పరుచూరి గోపాలకృష్ణ సూచించారు.

    English summary
    Paruchuri Gopala Krishna About Pawan Kalyan Words in Recent Janasena Meeting. In Today's Paruchuri Palukulu, Paruchuri Gopala Krishna Talks About Pawan Kalyan's Great Thought to Help People Through Janasena. He Also Explains About the Meaning of the Words Used by Him in Recent Janasena Meeting.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X