twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిలబెట్టింది ఆ నలుగురే.. దేవదాసు నుంచి ఇదే కథ.. నిన్నుకోరి కంటే తక్కువే.. మజిలీపై పరుచూరి!

    |

    నాగ చైతన్య, సమంత జంటగా నటించిన మజిలీ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన మజిలీ మంచి విజయం సాధించింది. మజిలీ చిత్రంతో నాగ చైతన్య, సమంత మరోసారి సూపర్ హిట్ జోడి అనిపించుకున్నారు. మజిలీ చిత్రం నాగ చైతన్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇదిలా ఉండగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ తాజాగా మజిలీ చిత్రంపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

    దేవదాసు నుంచి చూస్తున్నాం

    దేవదాసు నుంచి చూస్తున్నాం

    మజిలీ అంటే మనం చేరుకోవాల్సిన గమ్యం. ఈ చిత్రంలో నాగ చైతన్య ప్రేమలో విఫలమై మద్యానికి బానిసైన యువకుడిగా నటించాడు. ఇది దేవదాసు కాలం నుంచి వస్తున్న కథే అని పరుచూరి అన్నారు. ఇలాంటి చిత్రాలు ఇటీవల చాలానే వచ్చాయి. కథావస్తువు ఒకటే అయినా కథనంలో మార్పుల వల్ల విజయం సాధించవచ్చు అని పరుచూరి అన్నారు. మజిలీ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన నిన్నుకోరి కూడా దాదాపుగా ఇలాంటి కథే అని పరుచూరి అన్నారు.

    నాలుగు స్తంభాలు

    నాలుగు స్తంభాలు

    మజిలీ చిత్రం నలుగురి వల్ల విజయం సాధించింది అని పరుచూరి అన్నారు. నాగ చైతన్య, సమంత, పోసాని పాత్రలు మజిలీ చిత్రానికి నాలుగు స్తంభాల్లా నిలిచాయి. ఈ పాత్రలని చాలా సహజంగా ఉండేలా దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ పాత్రలని మనం నిజజీవితంలో కూడా చూస్తుంటాం అని పరుచూరి తెలిపారు.

    సమంత తెరచాపలా

    సమంత తెరచాపలా

    సముద్రంలో ప్రయాణించే నావకు తెరచాప అవసరం. మజిలీ చిత్రానికి సమంత పాత్ర తెరచాప లాంటిది అని పరుచూరి అన్నారు. నాగ చైతన్య కంటే సమంత పాత్రని దర్శకుడు బలంగా తీర్చిదిద్దాడని తెలిపారు. సినిమా గ్రాఫ్ పడిపోతున్న ప్రతిసారి సమంత తన నటనతో నిలబెట్టింది అన్నారు. మజిలీ, నిన్ను కోరి చిత్రాలని పోల్చుకుంటే.. నిన్ను కోరి చిత్రానికే ఒక మార్కు ఎక్కువ పడుతుందని అన్నారు. మజిలీ కథలో హీరోయిన్ ఆమె భర్త మధ్య హీరో పాత్ర ఉంటుంది. అది చాలా ఛాలెంజింగ్ గా అనిపించే విషయం. మజిలీలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయని పరుచూరి అన్నారు.

    ప్రతినాయకుడి పాత్ర

    ప్రతినాయకుడి పాత్ర

    మజిలీ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రకు సరైన ముగింపు లేదని పరుచూరి అన్నారు. ఇక సమంత ప్రియురాలు ఏమైందని విషయాన్ని ఆమె తండ్రి పాత్రతో కాకుండా.. ప్లాష్ బ్యాక్ ద్వారా దృశ్యరూపంలో చూపించి ఉంటె బావుండేదని పరుచూరి అభిప్రాయ పడ్డారు. క్లైమాక్స్ ని దర్శకుడు హార్ట్ టచింగ్ గా రాసుకున్నాడని పరుచూరి తెలిపారు. సమంత, నాగ చైతన్య మధ్యలో ప్రియురాలి కుమార్తె పాత్రతో ఇంకా బలమైన సన్నివేశాలు రూపొందించాల్సిందని పరుచూరి తెలిపారు. ఇలాంటి చిన్న లోపాలు మినహా మజిలీ చిత్రం బావుందని అన్నారు.

    English summary
    Paruchuri Gopala Krishna About Samantha and Naga Chaitanya's Majili. Shiva Nirvana is the director of Majili. Rao Ramesh and Posani playing key roles in Majili
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X