twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘టాక్సీవాలా’ను కాపాడింది అతడే: పరుచూరి హాట్ కామెంట్

    |

    విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రల్లో రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'టాక్సీవాలా'. ఈ సినిమాపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తనదైన విశ్లేషణ అందించారు.

    టాక్సీవాలా సినిమాకు ఈ టైటిల్ పెట్టడం చాలా ప్లస్సయింది. ఎందుకంటే ఇది హీరో కథ కాదు. ఒక అమ్మాయి కథ. కానీ ఇది అమ్మాయి కథ కాదు.. హీరో కథ అనిపించడానికి కారణం ఆ టైటిలే. టాక్సీవాలా అని మీరు పెట్టకుండా ఇంకేం పెట్టినా అది శిశిర అనే అమ్మాయి పాత్రలోకి కథ వెళ్లిపోయేది. అలా వెళ్లకుండా ఒక అద్భుతమైనటువంటి మకుటాన్ని పెట్టారు అని గోపాలకృష్ణ ప్రశంసించారు.

     విజయ్ దేవరకొండ లేకుంటే సినిమా ఆడేది కాదు

    విజయ్ దేవరకొండ లేకుంటే సినిమా ఆడేది కాదు

    ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లేకుంటే ఇంత బాగా ఆడుండేదా? ఏమో... ఆడుండక పోవచ్చు. ఎందుకంటే ఫస్టాఫ్ మొత్తాన్ని విజయ్ దేవరకొండ భరించాడు. సెకండాప్ మొత్తాన్ని కథ రాసిన రాహుల్ సంక్రిత్యాన్ భరించాడు. అణుక్షణం మనకు ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్టుతో తీసుకెళ్లాడు.

    ఆ పాయింట్ నమ్మించక పోతే అంతే

    ఆ పాయింట్ నమ్మించక పోతే అంతే

    ఇందులో డైరెక్టర్‌ను పొగడాల్సింది ఏమిటంటే... మీరు రెండున్నర గంటలు సినిమా చూస్తున్నపుడు ఏ నటుడు నటించినట్లు లేదు. వారు జీవించినట్లు ఉన్నారు. ప్రతి పాత్రను ఇది నిజంగా మన కళ్లముందే జరుగుతోంది అనే భావన తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడంటే సెకండాఫ్ లో ఉన్న కథ అలాంటిది. ఇక్కడ నిజంగానే కథ జరుగుతుంది అని మిమ్మల్ని నమ్మించక పోతే కష్టం అవుతుంది. ఈ కథ ప్రమాదకరమైన సైంటిఫిక్ పాయింట్ ఉన్న కథ. దాన్ని నమ్మించడంలో సక్సెస్ అయ్యాడు.

    డబుల్ ప్రాఫిట్స్: ‘టాక్సీవాలా' ఫస్ట్ వీక్ కలెక్షన్స్డబుల్ ప్రాఫిట్స్: ‘టాక్సీవాలా' ఫస్ట్ వీక్ కలెక్షన్స్

    అయ్యో ఈ అమ్మాయికి న్యాయం జరుగాలి అనే ఆలోచన మనకు రాక పోతే

    అయ్యో ఈ అమ్మాయికి న్యాయం జరుగాలి అనే ఆలోచన మనకు రాక పోతే

    ఆ తర్వాత ఇద్దరు హీరోయిన్లకు మార్కులు వేయాలి. ఇందులో వాళ్ల అందానికి కాదు... అభినయానికి వేయాలి. ప్రియాంక చాలా నేచురల్ గా కనిపించింది. మాళవిక నాయర్ అయితే నా మనవరాలిని గుర్తు చేసింది. ఆ అమ్మాయి తన కథలోకి థియేటర్లోని ప్రేక్షకులను కనెక్ట్ చేసింది. అయ్యో ఈ అమ్మాయికి న్యాయం జరుగాలి అనే ఆలోచన మనకు రాక పోతే ఈ సినిమా ఇంత విజయం పొందేది కాదు... అని తెలిపారు.

    స్క్రీన్ ప్లే బావుంది

    స్క్రీన్ ప్లే బావుంది

    సినిమా తొలి వారమే ఎంత వసూలు చేసిందో చూశారు. సెకండ్ వీక్ కూడా 95 శాతం థియేటర్లు నిండాయి. సినిమాలోని ఆర్టిస్టులందరూ అద్భుతంగా చేశారు. హీరో కనపడక పోతే హీరో కోసం సినిమాకు వచ్చిన వారికి ఎంత విసుగు పుడుతుందో నాకు నాకు తెలుసు. అది రాకుండా చేయాలంటే స్క్రీన్ ప్లే ముఖ్యం. అందుకు సాయి కిరణ్ రెడ్డిని మనం మెచ్చుకోవాలి.

    కొత్త హాస్య నటుడిని

    కొత్త హాస్య నటుడిని

    సినిమాలో విష్ణు చేసిన హాలీవుడ్ అనే పాత్ర బావుంది. కేవలం హాలీవుడ్ టైటిల్స్ చెప్పి నవ్వించడం మామూలు విషయం కాదు కాదు. ప్రీ క్లైమాక్స్‌లో మార్చురీలో సీన్ అయితే చాలా బావుంది. ఒక మంచి అద్భుతమైన హాస్య నటుడిని ఇండస్ట్రీకి ఇచ్చేశారు... అని పరుచూరి గోపాలకృష్ణ తన విశ్లేషణ అందించారు.

    English summary
    Paruchuri Gopala Krishna About Vijay Devarakonda's Taxiwaala Movie. In Today's Paruchuri Palukulu, Paruchuri Gopala Krishna Expresses His Views on Taxiwaala Movie. He Also Explains How Vijay Deverakonda Prepared His Audience for Taxiwaala.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X