twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రాణాలు పోయినపుడు రాజకీయాలు చేయవద్దు: పరుచూరి గోపాలకృష్ణ

    |

    పాపికొండల సమీపంలో గోదావరి నదిపై జరిగిన బోటు ప్రమాదంలో పలువురు మరణించండం, మరికొందరు గల్లంతైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రముఖ సినీ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ ఓ వీడియో విడుదల చేశారు. ఈ విషాద ఘటన తనను ఎంతగానో బాధించిందని తెలిపారు.

    ఈ పాపి కొండలు అనే శబ్దమే బాగోలేదు. నేను ఒకసారి 'మహా సంగ్రామం' అనే టైటిల్ పెడితే... ఇలాంటివి పేర్లు బాగోవు అని ఎవరో అన్నారు. ఇందులో యుద్ధం, మహా సంగ్రామం, మనిషి రోడ్డున పడటం ఉంది, అలాంటి పేర్లు పెట్టిన సినిమాలేవీ ఆడలేదు. ఎందుకంటే అవన్నీ అపశబ్దాలు. పాపికొండలు అనే శబ్దం కూడా అంతే.... అని పరుచూరి అభిప్రాయ పడ్డారు.

    వాటి అసలైన పేరు పాపిడి కొండలు

    వాటి అసలైన పేరు పాపిడి కొండలు

    వాస్తవానికి ఇవి ఒకప్పుడు పాపిడి కొండలు అని పిలవబడేవి. అటు ఇటు కొండలు ఉండి... స్త్రీ శిరస్సు భాగంలో మధ్యలో పాపిడి వెళ్లినట్లుగా వెళుతుందక్కడ... అందుకే పాపిడి కొండలు అనేవారట. కాల క్రమంలో అవి పాపికొండలు అని ప్రచారంలోకి వచ్చినట్లు పరుచూరి చెప్పుకొచ్చారు.

    వాటి పేరు మారిస్తే బావుంటుంది

    వాటి పేరు మారిస్తే బావుంటుంది

    ఖమ్మం జిల్లాలో ఉన్నాయి కాబట్టి ఉభయ రాష్ట్రాల్లో ఈ కొండలు విస్తరించి ఉంటాయి. దయచేసి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పాపిడి కొండలు అని పేరు పెడితే బావుంటుంది. ఈ పేరు బాగోలేదు అనుకుంటే కనీసం పాపి కొండలు అనే శబ్దం అయినా మార్చి రాముల వారి పేరో, సీతమ్మవారి పేరో, భద్రాద్రి పేరో ఏదో ఒక పేరుతో అందులోని అపశబ్దాన్ని తగ్గిస్తే బావుంటుంది.

    ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగా ఉండాలి

    ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగా ఉండాలి

    అక్కడ చాలా సార్లు ప్రమాదాలు జరిగాయి. ప్రభుత్వం తప్ప ప్రైవేటు వారు ఎవరూ బోట్లు ఆపరేట్ చేసే విధానం లేకుండా చేయకపోతే మరోసారి ఇలాంటి ఘోరాన్ని చూడాల్సి వస్తుంది. ఇది ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. 5 లక్షలు క్యూసెక్కుల నీరు ఉన్నపుడు వెళ్ల కూడదు. కానీ ఎలా వెళ్లారో అర్థం కావడం లేదు. అదే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటే వెళ్లనిచ్చేవారు కాదు.

    ప్రాణాలు పోయినపుడు రాజకీయాలు చేయవద్దు

    ప్రాణాలు పోయినపుడు రాజకీయాలు చేయవద్దు

    మనుషుల ప్రాణాలు పోయి ఉన్నపుడు గత ప్రభుత్వంలో అయినా, ఈ ప్రభుత్వంలో అయినా ప్రతిపక్షాలు విమర్శలకు దిగుతున్నారు. ఇలా ప్రాణాలు పోయినపుడు రాజకీయ విమర్శలు చేయకుండా ఎలా వారిని ఆదుకోవాలి, ఎలా ఆ కుటుంబంలో జరిగిన ఘోరాలకు ఏం చేసి వారి కన్నీళ్లు తుడవగలము? అనే విషయం ఆలోచించాలి. ఆ దు:ఖాన్ని అయితే ఆపలేము. ఓ వృద్ధురాలు నా కొడుకు అని ఏడుస్తుంటే గుండె చెరువు అవుతోంది.. అని పరుచూరి చెప్పుకొచ్చారు.

    English summary
    Paruchuri Gopala Krishna Advice To AP Govt Over Papidi Kondalu Boat Incident. In Today's Paruchuri Palukulu, Tollywood Senior Cine Writer Shri. Paruchuri Gopala Krishna talks about the Godavari riverboat incident and shares his condolences to families who lost their loving ones in the tragedy. He also tells about the history behind name Papidi Kondalu and advises Andhra Pradesh State Government to change its name.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X