twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ తప్పు చేశాడు.. మాజీ సీఎంను ఆదర్శంగా తీసుకోవాలి.. జగన్‌లా చేయాలి: రచయిత షాకింగ్ కామెంట్స్

    |

    Recommended Video

    Paruchuri Gopala Krishna Interesting Comments On Pawan Kalyan || Filmibeat Telugu

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరుచూరి బ్రదర్స్ తమదైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఎన్నో సినిమాలకు స్టోరీలు, డైలాగ్స్ అందించిన ఈ సోదరులు.. నటనతోనూ ఆకట్టుకున్నారు. పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి వెంకటేశ్వర్రావు కొద్దిరోజుల నుంచి విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే, వీరిలో గోపాలకృష్ణ పరుచూరి పలుకులు అనే పేరుతో యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. ఒక్కో వీడియోలో ఒక్కొక్కరి గురించి మాట్లాడుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

    ఎన్నికల ఫలితాలపై..

    ఎన్నికల ఫలితాలపై..

    ఎన్నికల ఫలితాలపై పవన్ వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ‘తానా సభల కోసం అమెరికా వెళ్లినప్పుడు పవన్ చాలా విషయాలు మాట్లాడాడు. ఎన్నికల ఫలితాలపై స్పందిచాడు. ‘‘రిజల్ట్ చూసినప్పుడు పదిహేను నిమిషాలు బాధ పడ్డాను'' అని పవన్ అన్నాడు. ఆ పదిహేను నిమిషాలు కూడా అతడు బాధ పడి ఉండకూడదు. ఎందుకంటే.. ఓటింగ్ జరుగుతున్నప్పుడే అందరికీ ఫలితం అర్థమైపోయింది కదా. అందుకే అస్సలు బాధపడొద్దు' అని పరుచూరి చెప్పుకొచ్చారు.

    భయమనేదే తెలియదు

    భయమనేదే తెలియదు

    అలాగే, పవన్ భయం గురించి చెబుతూ.. ‘తానా సభల్లో నాకు భయమెందుకు అని పవన్ అన్నాడు. వాస్తవానికి ఆయనకు భయం ఉంటదంటే నేను నమ్మను. అతడికి కొంచెం కూడా భయం ఉండదు. పవన్‌లో ఒక యోగి ఉన్నాడని తెలుస్తుంది. ఆ యోగి పవన్‌ను పాజిటివ్ ఎనర్జీతో నడిపిస్తున్నాడు' అని వివరించారు.

    పవన్ సినిమాలు మానొద్దు

    పవన్ సినిమాలు మానొద్దు

    పవన్ సినిమాలకు గ్యాప్ ఇచ్చిన దానిని ప్రస్తావిస్తూ.. ‘జనసేన కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తూనే రాజకీయాలు చేయాలని కోరుకుంటున్నారు. అయితే మళ్లీ సినిమాల్లో నటించే విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ విముఖంగా ఉన్నారని ఎప్పటికప్పుడు ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. కానీ, ఆయన సినిమాలు చేస్తే బాగుటుంది. అన్న ఎన్టీఆర్ గారు కూడా సినిమాలు చేసి ప్రజలను ప్రభావితం చేశారు. ఈ విషయాన్ని పవన్ గుర్తు తెచ్చుకోవాలి' అని పరుచూరి పేర్కొన్నారు.

    ఎంజీఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

    ఎంజీఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

    పవన్ సినిమాలు చేయాలనే దానిపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రరావు పేరును ప్రస్తావిస్తూ.. ‘పవన్ ఎంజీఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కూడా ఆయన సినిమాల్లో నటించారు. రాజకీయాలను, సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ కొంతకాలం ముందుకు సాగారు. పవన్ కళ్యాణ్ సైతం సోషల్ మెసేజ్ ఉన్న అంశాలను తీసుకుని సినిమాలు చేయాలి' అని చెప్పుకొచ్చారు.

    జగన్‌లా పట్టుదలతో ఉండాలి

    జగన్‌లా పట్టుదలతో ఉండాలి

    ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన తండ్రి చనిపోయినప్పటి నుంచి ఎంతో ఓపికగా పోరాటం చేస్తున్నారు. సీఎం అవ్వాలన్న పట్టుదలతో పది సంవత్సరాల పాటు పని చేశారు. అలాగే పవన్ కూడా ప్రజల్లో ఉండాలి' అని సలహా ఇచ్చారు.

    English summary
    Tollywood senior Writter Paruchuri Gopala Krishna started youtube Channel Few days back. He Comments on many Film Actors and politicions. now Its Time For pawan kalyan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X