నిత్యానందతో రంజిత రాసలీలలు.. ఆ వీడియో చూడగానే.. విషయం బయటపెడుతూ పరుచూరి ఆవేదన

తెలుగు, తమిళ భాషల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రంజిత ఆ మధ్య నిత్యానందకు సంబంధించిన రాసలీలల వీడియోల్లో కనిపించడంతో ఒక్కసారిగా అంతా షాకయ్యారు. ఆ తర్వాత రంజిత ఎక్కడా కనిపించలేదు. అయితే తాజాగా రంజిత విషయమై పరుచూరి గోపాలకృష్ణ కొన్ని ఆసక్తికర విషయాలు చెబుతూ ఆవేదన చెందారు. ఆ వివరాలు చూస్తే..

పరుచూరి పలుకులు.. రంజిత మ్యాటర్

పరుచూరి పలుకులు.. రంజిత మ్యాటర్

తాను తిలకం దిద్దిన నటి రంజిత అని చెప్పిన పరుచూరి.. ఇటీవల ఆమె ఎక్కడో తలదాచుకుంటోందని తెలిసిందని చెబుతూ ఆవేదన చెందారు. ఈ మేరకు రంజితతో తనకున్న పరిచయం, ఆమె వెండితెర ప్రయాణం తాలూకు కొన్ని విషయాలు వెల్లడించారు. తన తాజా పరుచూరి పలుకులు ఎపిసోడ్ లో ఈ సంగతులను పంచుకున్నారు.

వాళ్ళ నాన్నను ఒప్పించి మరీ.. కడప రెడ్డెమ్మ

వాళ్ళ నాన్నను ఒప్పించి మరీ.. కడప రెడ్డెమ్మ

రంజిత తన మూడో కూతురికి స్నేహితురాలిని, ఆమె ఓ రోజు తమ ఇంటికి వస్తే ఆమెను చూడగానే ఆ అమ్మాయికి హీరోయిన్ అయ్యే లక్షణాలు ఉన్నాయని అనిపించిందని తెలిపారు. వాళ్ల నాన్న గారు కూడా నటుడే. ఆయనను ఒప్పించి తెలుగు తెరకి 'కడప రెడ్డెమ్మ' సినిమా ద్వారా పరిచయం చేశానని తెలిపారు.

చిన్న పిల్లలాగా రంజిత..

చిన్న పిల్లలాగా రంజిత..

ఈ సినిమా తరువాత రంజిత తమిళ ఇండస్ట్రీకి వెళ్లి కథానాయికగా అగ్రస్థానాన్ని చేరుకుందని పరుచూరి చెప్పారు. అయితే ఓసారి తనకు రంజిత కుటుంబం రైల్వే స్టేషన్ వద్ద ఎదురుపడిందని, అప్పుడు రంజిత చిన్న పిల్లలాగా తన దగ్గరికి వచ్చి ‘థ్యాంక్స్ అంకుల్' అని హత్తుకుందని చెప్పారు. అద్భుతమైన వేషాలు వేసి మంచి స్థాయికి వెళ్లిందని, తనను ఎప్పుడూ ఓ తండ్రిలా ఆమె చూసేదని పరుచూరి పేర్కొన్నారు.

ఇలాంటి వాటి మీద నమ్మకం లేదమ్మా అన్నాను

ఇలాంటి వాటి మీద నమ్మకం లేదమ్మా అన్నాను

కొన్ని రోజుల తర్వాత ఆమె తన దగ్గరికి వచ్చి ‘నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను' అని చెప్పిందని.. ఎందుకమ్మా సినిమాలు చేసుకోక అన్నానని చెప్పారు పరుచూరి. ఆ తర్వాత మళ్లీ కొన్ని రోజులకు తన దగ్గరికి వచ్చి తన చేతిలో ఓ పుస్తకం పెట్టిందని అన్నారు. అది నిత్యానందకు సంబంధించిన బుక్. ఆయన చాలా గొప్పవారు అంకుల్ ఈ పుస్తకం చదవండి అంది. దీంతో ఇలాంటి వాటి మీద నమ్మకం లేదమ్మా అని చెప్పానని పరుచూరి అన్నారు.

నిత్యానందతో రంజిత రాసలీలలు చూసి

నిత్యానందతో రంజిత రాసలీలలు చూసి

''ఆ రోజే గనక నువ్వు కూడా అతని భజలకు వెళ్లకమ్మా అని చెప్పి ఉంటే బాగుండేదేమో. ఏ రోజైతే నిత్యానంద, రంజితలకు సంబంధించిన వీడియోలు చూశానో నా గుండె పగిలింది. బంగారు మనసున్న అమ్మాయి అలాంటి ఆధ్యాత్మికత వైపు వెళ్లిపోయి అతని వలలో చిక్కుకుంది. నేను మంచి నటి అవుతుంది అనుకున్నా. కానీ తను వేరే మార్గం ఎంచుకుంది. ఏదేమైనా రంజిత ఎక్కడున్నా చల్లగా ఉండాలని కోరుకుంటున్నా'' అని చెప్పారు పరుచూరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X