twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోడి రామకృష్ణగారే అర్జునుడిలా, ఊహించలేదు.. పరుచూరి గోపాలకృష్ణ!

    |

    టాలీవుడ్ దిగ్గజ దర్శకుడైన కోడి రామకృష్ణ శుక్రవారం తుది శ్వాస విడిచారు. 100కు పైగా చిత్రాలకు దర్శత్వం వహించిన ఘనత ఆయనది. అనారోగ్యంతో భాదపడుతున్న కోడి రామకృష్ణ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. టాలీవుడ్ లోని స్టార్ హీరోలకు ఆయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించారు. కోడి రామకృష్ణ మరణంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. కోడి రామకృష్ణకు సంబంధించిన ఆసక్తికర విషయాల్ని, మధుర జ్ఞాపకాలని సినీ ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కోడి రామకృష్ణతో ఉన్న అనుభందాని గుర్తు చేసుకున్నారు.

    అనివార్య కారణాల వలన

    అనివార్య కారణాల వలన

    కోడి రామకృష్ణతో తాము కలసి తరంగిణి చిత్రాన్ని పనిచేయాల్సింది అని అన్నారు. కానీ అనివార్య కారణాల వలన అది కుదర్లేదు అని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. ఆ తర్వాత ఆయనతో పోరాటం, జైలు పక్షి లాంటి చిత్రాలకు పనిచేశాం. విభిన్నమైన జోనర్స్ లో ఎక్కువ సినిమాలు చేసిన దర్శకుడు కోడి రామకృష్ణ గాంరే అని పరుచూరి ప్రశంసించారు.

    మహా భారతంలోనే చూస్తాం

    మహా భారతంలోనే చూస్తాం

    ద్రోణాచార్యుడికి సాటిరాగల అర్జునుడిని మహాభారతంలోని చూస్తాం. కానీ ఇక్కడ కూడా అది జరిగింది. దాసరి నారాయణరావు ద్రోణాచార్యులు అయితే.. కోడి రామకృష్ణ అర్జునుడి లాంటివారు. దాసరినారాయణరావు గారిని మించే దర్శకుడు వస్తాడా అని మేమెంత అనుకుంటున్న రోజుల్లో.. ఆయన శిష్యుడైన కోడి రామకృష్ణగానే తన గురువుకు సమీపంగా వెళ్లగలిగారని పరుచూరి ప్రశంసించారు.

    నటులు కానివారిని కూడా

    నటులు కానివారిని కూడా

    కోడి రామకృష్ణ ఎందరో నటుల్ని వెండి తెరకు పరిచయం చేశారు. హౌస్ ఓనర్ గా ఉన్నా రామిరెడ్డినే అంకుశం చిత్రంలో విలన్ గా పరిచయం చేశారు. ఆ తర్వాత కాలంలో రామిరెడ్డి అంటేనే తెలుగు ప్రేక్షకులు భయపడేవారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రం ద్వారా గొల్లపూడి మారుతీ రావుకు కూడా మంచి గుర్తింపు తీసుకుని వచ్చారు. కోడి రామకృష్ణ చేసిన 70 శాతం చిత్రాలు 100 రోజులకు పైగా ఆడాయి అని పరుచూరి తెలిపారు.

    సామాజిక అంశాలతో

    సామాజిక అంశాలతో

    కోడి రామకృష్ణ దర్శత్వంలో వచ్చిన చాలా చిత్రాలు సామజిక అంశాలతో తెరకెక్కాయి. అయినా కూడా ఆ చిత్రాలు కమర్షియల్ గా విజయం సాధించాయి అని పరుచూరి అన్నారు. ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో చేరారని తెలిసి చూద్దామని అనుకుంటున్నా సమయంలో ఈ వార్త తెలిసింది. ఆయన్ని ఇలా చూడాల్సి రావడం దురదృష్టకరం అని పరుచూరి గోపాలకృష్ణ తన సంతాపాన్ని తెలియజేశారు.

    English summary
    Paruchuri Gopala Krishna pays tribute to Director Kodi Ramakrishna
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X