twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ ఫలితం దక్కుతుందని అన్నారు

    By Srikanya
    |

    బాలకృష్ణ చిన్నగా నవ్వేసి 'నువ్వు వూళ్లోనే ఉంటావా మురళి' అని అడిగారు. అంతే... ఇంకేమీ మాట్లాడలేదు. అలా ఆయన స్పందన చూశాక నాకేమీ అర్థం కాలేదు. బాలకృష్ణ మాత్రమే చెయ్యాల్సిన కథ ఇది. సరిగ్గా చెప్పి ఒప్పించలేకపోయానా? అని ఆలోచిస్తూ వెళ్లిపోయాను.మరుసటి రోజు బాలకృష్ణ ఫోన్‌ చేసి 'మురళీ కథ చాలా బాగుంది. ఒక పెద్ద సినిమా అవుతుంది. నువ్వు ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది'అన్నారు. ఆ మాట వినగానే నూతనోత్సాహం కలిగింది అంటూ దర్శకుడు పరుచూరి మురళి తన తాజా చిత్రం అధినాయకుడు కథ ఒప్పించిన విధానం గురించి చెప్పుకొచ్చారు.

    ఇక చిత్రంలో బాలకృష్ణని మూడు పాత్రల్లో చూపెట్టాలనే ఆలోచన వచ్చిన విధానం గురించి చెపుతూ..బాలకృష్ణ త్రిపాత్రాభినయం అని చెప్పి ఆకట్టుకొనేందుకు సృష్టించిన పాత్రలు కావవి. కథలో నుంచి సహజంగా పుట్టాయి. పెద్దాయన, మధ్యవయస్కుడు, యువకుడు... ఇలా మూడు పాత్రల్లో కనిపించాలి. అలాంటి ఓ కథైతే రాసుకొన్నాను కానీ... ఆ మూడు పాత్రల్ని పోషించగల నటుడు ఎవరున్నారు? అనే ప్రశ్న ఆ తర్వాత మెదిలింది. అప్పుడు నాకు తట్టిన ఒకే ఒక హీరో బాలకృష్ణ. కేవలం ఆయన కోసమే పుట్టిన కథ ఇది. తప్పకుండా ఈ మూడు పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి అన్నారు.

    అలాగే తమ 'అధినాయకుడు'లో ఏం చెప్పబోతున్నారో వివరిస్తూ...నాయకుడు అనేవాడు తరతరాలకు స్ఫూర్తినివ్వాలి. నమ్ముకొన్నవాళ్లకి న్యాయం చేసేందుకు ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడాలి. అలాంటి ఓ సిసలైన నాయకుడి కథే ఇది. హైదరాబాద్‌లో మొదలై... రాయలసీమకు చేరుతుంది. ఏ ఒక్క వర్గాన్నో సంతృప్తిపరిస్తే ఫలితం ఉండదనే విషయాన్ని నమ్మాను. అలాగే అభిమానుల్ని దృష్టిలో పెట్టుకొని పనిచేశా. అయితే బాలకృష్ణతో పని చెయ్యడం నాకు కొత్త కాదు. దర్శకుడు శరత్‌ దగ్గర సహాయకుడిగా పనిచేశాను. అప్పుడే బాలకృష్ణ శైలిని దగ్గర్నుంచి చూసేవాణ్ని. ఎప్పటికైనా ఆయనతో సినిమా చేస్తానని అప్పట్లోనే అనుకొనేవాణ్ని. అది ఇప్పటికి నెరవేరింది అని వివరించారు.

    అంతేకాగ తాను బయట జరిగే పరిస్థితుల్ని చూసి కథ రాసుకొనే దర్శకుడిని కాదని అన్నారు. ఎందుకో తెలియదు... మొదట్నుంచీ ఆ విధానానికి నేను విరుద్ధం. వర్తమాన రాజకీయాలకీ, ఈ సినిమాకీ ఎలాంటి సంబంధం లేదు. చివరి ఇరవై నిమిషాలు మాత్రమే ఆ వాతావరణం కనిపిస్తుందంతే. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు, వినోదం తదితర అంశాలతో ఆద్యంతం ఆసక్తిగా సాగే చిత్రమిది. ఇందులోని ప్రతి సన్నివేశం ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంది అని చెప్పారు.

    English summary
    Director Paruchuri Murali expressed his happiness to work with Balakrishna. He said that earlier he worked as assistant director to Balakrishna films and that created interest to direct Balayya.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X