Don't Miss!
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- News అపార్ట్ మెంట్ లో మహిళ స్నానం చేస్తుంటే సెక్యూరిటీ గార్డు ?, పిల్లర్ కు కట్టేసి పిండేసి, అంతే !
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
రెచ్చిపో..డైరక్టర్ ఆవేదన
నితిన్, ఇలియానా కాంబినేషన్ లో వచ్చిన రెచ్చిపో చిత్రం పై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ దర్శకుడు పరుచూరి మురళి మీడియా వద్ద ఆవేదన వ్యక్తం చేసారు. ఆయన మాటల్లోనే... అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మా చిత్రానికి మంచి స్పందన వస్తోంది. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు తను పెట్టిన డబ్బులకు మించిన వినోదాన్ని పొందుతూ పూర్తి సంతృప్తిని ఫీలవుతున్నాడు. కానీ ఈ సినిమాకు మొదటి రోజు కొంత మంది కావాలని డివైడ్ టాక్‌ను తీసుకొచ్చారు. రెండు గంటల పదిహేను నిమిషాల నిడివి గల ఈ చిత్రాన్ని మూడు గంటల నిడివి వుందంటూ అసత్య ప్రచారాన్ని చేశారు. అసలు ఆ వ్యక్తులు ఎందుకలా ప్రచారం చేస్తున్నారో నాకర్థం కావడం లేదు.
నేను అందరితోనూ ఇట్టే కలిసిపోయే వ్యక్తిని. ఎటువంటి వివాదాల జోలికి వెళ్లను.అంతేకాదు... వేరే వాళ్ల సినిమా గురించి కామెంట్ కూడా చేయను. కాని నా విషయంలో ఇలా జరగడం చాలా బాధగా వుంది.
సినిమా విడుదల రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్లు వున్నాయి. నేటికి చిత్రం హౌస్‌ఫుల్స్‌తో రన్ అవుతోంది. నా నిర్మాత, ఎగ్జిబిట్లర్లు చాలా హ్యాపీగా వున్నారు. ఎగ్జిబిటర్స్ ఫోన్ చేసి కలెక్షన్స్ బాగా వున్నాయి, సినిమా తప్పకుండా సూపర్‌హిట్‌గా నిలుస్తుంది అని చెబుతుంటే సంతోషంగా వుంది అన్నారు.
అలాగే నుంచి నిర్మాత, పంపిణీదారుడు, ఎగ్ిజిబిటర్స్ , ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నాను. ఈ సినిమా కూడా నేను ఓ సగటు ప్రేక్షకుడిలా ఆలోచించి అన్ని వర్గాలకు కావలసిన అంశాలను మేళవించి తెరకెక్కించాను. 'రెచ్చిపో' అనే మాస్ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందినా...కుటుంబంతో సహా కూర్చొని చూడదగ్గ చక్కటి చిత్రమిది. అన్ని అంశాలు కథలో చక్కగా ఇమిడాయి. నితిన్ కూడా ఓ సక్సెస్ కావాలి అని ఎంతో కసితో, కష్టపడి ఈ చిత్రాన్ని చేశాడు. అతని నటనకు మంచి స్పందన లభిస్తోంది. ఇలియానా కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా చక్కని నటన కనబరిచారు.
ఇక నా గత చిత్రాల్లో సీరియస్, సెంటిమెంట్ పాళ్లు ఎక్కువగా వుండేవి. కాని ఈ చిత్రం లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దాను. నేటి ట్రెండ్‌కు తగ్గట్లుగా వినోదాన్ని ఎక్కువగా జోడించాం అన్నారు.ఇప్పటి వరకు నేను చేసిన చిత్రాల్లో 'రెచ్చిపో' ది బెస్ట్ చిత్రంగా చెప్పుకోవచ్చు. దర్శకునిగా నన్ను ప్రేక్షకులకు మరింత చేరువ చేసిన చిత్రంగా నేను నమ్ముతున్నాను. అయితే ఇవన్నీ ఇలా ఉంటే రెచ్చిపో చిత్రం డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.