twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెచ్చిపో..డైరక్టర్ ఆవేదన

    By Staff
    |

    నితిన్, ఇలియానా కాంబినేషన్ లో వచ్చిన రెచ్చిపో చిత్రం పై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ దర్శకుడు పరుచూరి మురళి మీడియా వద్ద ఆవేదన వ్యక్తం చేసారు. ఆయన మాటల్లోనే... అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మా చిత్రానికి మంచి స్పందన వస్తోంది. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు తను పెట్టిన డబ్బులకు మించిన వినోదాన్ని పొందుతూ పూర్తి సంతృప్తిని ఫీలవుతున్నాడు. కానీ ఈ సినిమాకు మొదటి రోజు కొంత మంది కావాలని డివైడ్‌ టాక్‌ను తీసుకొచ్చారు. రెండు గంటల పదిహేను నిమిషాల నిడివి గల ఈ చిత్రాన్ని మూడు గంటల నిడివి వుందంటూ అసత్య ప్రచారాన్ని చేశారు. అసలు ఆ వ్యక్తులు ఎందుకలా ప్రచారం చేస్తున్నారో నాకర్థం కావడం లేదు.

    నేను అందరితోనూ ఇట్టే కలిసిపోయే వ్యక్తిని. ఎటువంటి వివాదాల జోలికి వెళ్లను.అంతేకాదు... వేరే వాళ్ల సినిమా గురించి కామెంట్‌ కూడా చేయను. కాని నా విషయంలో ఇలా జరగడం చాలా బాధగా వుంది.

    సినిమా విడుదల రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్లు వున్నాయి. నేటికి చిత్రం హౌస్‌ఫుల్స్‌తో రన్‌ అవుతోంది. నా నిర్మాత, ఎగ్జిబిట్లర్లు చాలా హ్యాపీగా వున్నారు. ఎగ్జిబిటర్స్‌ ఫోన్‌ చేసి కలెక్షన్స్‌ బాగా వున్నాయి, సినిమా తప్పకుండా సూపర్‌హిట్‌గా నిలుస్తుంది అని చెబుతుంటే సంతోషంగా వుంది అన్నారు.

    అలాగే నుంచి నిర్మాత, పంపిణీదారుడు, ఎగ్ిజిబిటర్స్ , ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నాను. ఈ సినిమా కూడా నేను ఓ సగటు ప్రేక్షకుడిలా ఆలోచించి అన్ని వర్గాలకు కావలసిన అంశాలను మేళవించి తెరకెక్కించాను. 'రెచ్చిపో' అనే మాస్‌ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందినా...కుటుంబంతో సహా కూర్చొని చూడదగ్గ చక్కటి చిత్రమిది. అన్ని అంశాలు కథలో చక్కగా ఇమిడాయి. నితిన్‌ కూడా ఓ సక్సెస్‌ కావాలి అని ఎంతో కసితో, కష్టపడి ఈ చిత్రాన్ని చేశాడు. అతని నటనకు మంచి స్పందన లభిస్తోంది. ఇలియానా కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా చక్కని నటన కనబరిచారు.

    ఇక నా గత చిత్రాల్లో సీరియస్‌, సెంటిమెంట్‌ పాళ్లు ఎక్కువగా వుండేవి. కాని ఈ చిత్రం లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాను. నేటి ట్రెండ్‌కు తగ్గట్లుగా వినోదాన్ని ఎక్కువగా జోడించాం అన్నారు.ఇప్పటి వరకు నేను చేసిన చిత్రాల్లో 'రెచ్చిపో' ది బెస్ట్‌ చిత్రంగా చెప్పుకోవచ్చు. దర్శకునిగా నన్ను ప్రేక్షకులకు మరింత చేరువ చేసిన చిత్రంగా నేను నమ్ముతున్నాను. అయితే ఇవన్నీ ఇలా ఉంటే రెచ్చిపో చిత్రం డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X