twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో రాణా స్వార్థపరుడంటూ 'సింహా' నిర్మాత

    By Srikanya
    |

    సంపూర్ణ స్వార్థపరుడైన ఓ యువకుడు ఓ అమ్మాయి పరిచయంతో ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నాడు, ఎలా స్పందించాడు? ఎలా మారాడు? అనేది కథాంశం. తర్వాత సన్నివేశం ఏంటనే ఆసక్తి ప్రేక్షకుడిలో కలుగుతుంటుంది. ప్రేక్షకులు తల తిప్పకుండా చూసేంత ఆసక్తికరంగా కథ నడుస్తుంది. చక్కని పాటలు, విజువల్స్ ఉన్నాయి. ఈ సినిమాలో హీరో రాణా పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో సాగుతుంది అంటున్నారు సింహా నిర్మాత పరుచూరి ప్రసాద్.

    ఆయన తాజా చిత్రం నాఇష్టం త్వరలో విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే...రాణా గత చిత్రాలు రెండు ప్రయోగాత్మకంగా వుంటాయి. 'నా ఇష్టం' అతను నటిస్తున్న తొలి కమర్షియల్ చిత్రం. చిత్ర కథ మలేషియా నేపథ్యంలో నడుస్తుంది. అన్నింటా స్వలాభాన్ని ఆశిస్తూ స్వార్థంతో జీవితాన్ని గడిపే వ్యక్తి జీవితంలో ఓ అమ్మాయి తారసపడితే తదనంతరం జరిగే పరిణామాలేమిటి? భిన్న ధ్రువాలుగా వుండే వారిద్దరి మనస్తత్వాలు ప్రేమ ప్రయాణంలో ఏ తీరాలకు చేరుకున్నాయి? అనే అంశాల సమాహారమే ఈ చిత్ర కథ. రెండున్నర గంటలు ప్రేక్షకుల్ని కదలకుండా కూర్చోబెట్టే చిత్రమిది. స్క్రీన్‌ప్లే పరంగా ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా వుంటుంది. ముఖ్యంగా రాణా ఈ సినిమాలో డ్యాన్సుల కోసం చాలా కష్టపడ్డాడు అని చెప్పుకొచ్చారు.

    English summary
    Producer Paruchuri Prasad says that Rana's Character in Naa Istam is Pure Selfish.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X