Don't Miss!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హీరో రాణా స్వార్థపరుడంటూ 'సింహా' నిర్మాత
సంపూర్ణ స్వార్థపరుడైన ఓ యువకుడు ఓ అమ్మాయి పరిచయంతో ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నాడు, ఎలా స్పందించాడు? ఎలా మారాడు? అనేది కథాంశం. తర్వాత సన్నివేశం ఏంటనే ఆసక్తి ప్రేక్షకుడిలో కలుగుతుంటుంది. ప్రేక్షకులు తల తిప్పకుండా చూసేంత ఆసక్తికరంగా కథ నడుస్తుంది. చక్కని పాటలు, విజువల్స్ ఉన్నాయి. ఈ సినిమాలో హీరో రాణా పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో సాగుతుంది అంటున్నారు సింహా నిర్మాత పరుచూరి ప్రసాద్.
ఆయన తాజా చిత్రం నాఇష్టం త్వరలో విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే...రాణా గత చిత్రాలు రెండు ప్రయోగాత్మకంగా వుంటాయి. 'నా ఇష్టం' అతను నటిస్తున్న తొలి కమర్షియల్ చిత్రం. చిత్ర కథ మలేషియా నేపథ్యంలో నడుస్తుంది. అన్నింటా స్వలాభాన్ని ఆశిస్తూ స్వార్థంతో జీవితాన్ని గడిపే వ్యక్తి జీవితంలో ఓ అమ్మాయి తారసపడితే తదనంతరం జరిగే పరిణామాలేమిటి? భిన్న ధ్రువాలుగా వుండే వారిద్దరి మనస్తత్వాలు ప్రేమ ప్రయాణంలో ఏ తీరాలకు చేరుకున్నాయి? అనే అంశాల సమాహారమే ఈ చిత్ర కథ. రెండున్నర గంటలు ప్రేక్షకుల్ని కదలకుండా కూర్చోబెట్టే చిత్రమిది. స్క్రీన్‌ప్లే పరంగా ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా వుంటుంది. ముఖ్యంగా రాణా ఈ సినిమాలో డ్యాన్సుల కోసం చాలా కష్టపడ్డాడు అని చెప్పుకొచ్చారు.