తనీష్ కనిపించడు.. కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే.. పరుచూరి షాకింగ్ కామెంట్స్

లారా పాత్రలో తనీష్ నటన ఒక రిఫరెన్స్ లా మిగులుతుంది- ''రంగు'' ప్రీరిలీజ్ ఈవెంట్ లో సిరివెన్నెల సీతారామశాస్త్రి న‌ల్ల‌స్వామి స‌మ‌ర్ప‌ణ‌లో యు అండ్ ఐ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై త‌నీశ్‌, ప‌రుచూరి ర‌వి, ప్రియా సింగ్‌, ప‌రుచూరి వెంకటేశ్వ‌ర‌రావు, ష‌ఫీ, పోసాని కృష్ణ‌ముర‌ళి ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న చిత్రం రంగు. కార్తికేయ‌.వి ద‌ర్శ‌క‌త్వంలో ఎ.ప‌ద్మ‌నాభ‌రెడ్డి, న‌ల్ల అయ్య‌న్న నాయుడు నిర్మాత‌లు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. బిగ్ బాస్ సీజన్ 2 పాల్గొన్న సభ్యులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డాన్సర్స్ తో కలసి ఆడిపాడి హీరో, హీరోయిన్లు అతిథులను ఆనందింప చేసారు. ఈవెంట్ లో 'రంగు' సినిమా పాటలను అతిథులతో లాంచ్ చేయించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా అతిథులు, చిత్ర బృదం మాట్లాడుతూ...

ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 20 ఏళ్లు

ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 20 ఏళ్లు

హీరో త‌నీశ్ మాట్లాడుతూ.. నేను ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 20 ఏళ్లు అయ్యింది.నా తొలి సినిమా హిట్ అయిన రోజు నాకు చాలా ఆనంద‌మేసింది. చాలా ఏళ్ల త‌ర్వాత ఇంత ఆనందంగా ఉంది. ఈ సినిమాలో సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు లాంటి దిగ్గ‌జాల‌తో క‌లిసి ప‌నిచేశాను. చాలా
రోజుల త‌ర్వాత మా అమ్మ నా కోసం ఈ ఫంక్ష‌న్‌కు వ‌చ్చారు. నా ఎక్స్‌డెంటెడ్ ఫ్యామిలీతో జ‌రుపుకుంటున్న తొలి ఫంక్ష‌న్. ఇందులో హీరోలు,విల‌న్స్ లేరు.. అన్ని పాత్ర‌లే. ప్ర‌తి పాత్ర ఎలా ఉండాలి.. ఎలా ఉండ‌కూడ‌ద‌నే విష‌యాల‌ను నేర్పిస్తుంది. ఈ నెల 23న మా సినిమా పోస్ట‌ర్ ప‌డుతుంది. సినిమా విడుద‌ల‌వుతుంది అని అన్నారు.

తనీష్‌కు బ్రేక్ ఇవ్వడం ఖాయం

తనీష్‌కు బ్రేక్ ఇవ్వడం ఖాయం

రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. టైటిల్ నాకు బాగా నచ్చింది. సినిమా పాటలు,ట్రైలర్స్ చూస్తుంటే చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. తనీష్ నటన ఎంటో మనం చిన్నతనం నుండి చూస్తున్నాం. అతనికి ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందని
నమ్ముతున్నాను.. అన్నారు.

తనీష్ కనపడలేదు లారానే

తనీష్ కనపడలేదు లారానే

పరుచూరి వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ.. ఈ సినిమా నేను చూసాను, తనీష్ కనపడలేదు లారానే కనపడ్డాడు. లారా కుటుంబ సభ్యుల ఈ సినిమా చూసి కన్నీళ్ళు పెట్టుకున్నారు. ప్రేక్షకులకు కూడా అదే భావన కలుగుతుందని నా నమ్మకం. లారా అనే వ్యక్తులు విజయవాడలోనే కాదు, ప్రతి ఊరిలోనూ కనపడతారు. అలాంటి యూనివర్సల్ సబ్జెక్ట్ ను తీసుకున్నాడు
దర్శకుడు. తనీష్ నటన అద్భుతంగా ఉంది. మా చేతులు మీదుగా పెద్ద స్టార్ ని చేయాలని ఉంది. రంగు అనే టైటిల్ ఎందుకు పెట్టారంటే మనుషులలో రకరకాల రంగులు
ఉంటాయి. అవి అవసరాన్ని బట్టి బయటపడతాయి. ఈ సినిమా విశేషంగా ప్రజలను ఆకట్టుకుంటుంది అని నా నమ్మకం'' అన్నారు.

సినిమాలో కథ లేకుంటే

సినిమాలో కథ లేకుంటే

సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ.. ఈ ఈవెంట్‌కు రావడానికి కారణం నిర్మాత పద్మనాభ‌రెడ్డి.ఇలాంటి వ్యక్తులు ఇండస్ట్రీ లో తక్కువుగా ఉంటారు. కథ బాగుంటే సినిమాలు ప్రజాదరణ పొందుతున్నాయి. కథ లేని సినిమాలను ఎన్ని హాంగులున్నా ప్రేక్షకులు తిప్పి కొడుతున్నారు. రంగు చాలా
ఆరోగ్య కరమైన సినిమా. లారా పాత్రలో తనీష్ నటన ఒక రిఫరెన్స్ లామిగలుతుంది. ఈ సినిమా తో స్టార్స్ అయినా నేల మీద నక్షత్రాలుగా ఉండాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

యువత ఆలోచనలకు దగ్గరగా

యువత ఆలోచనలకు దగ్గరగా

నటుడు పరుచూరి రవి మాట్లాడుతూ.. యువత ఆలోచనలకు దగ్గరగా ఉండే సినిమా ఇది. రెగ్యులర్ పోలీస్ పాత్రలకంటే
భిన్నంగా నా పాత్ర ఉంటుంది. ఈ సినిమా తనీష్‌కు మంచి బ్రేక్ నిస్తుంది.అలాగే ‘రంగు ' పనిచేసిన వారందరికీ మంచి గుర్తింపు నిస్తుందని నమ్ముతున్నాను. మౌనపోరాటం, సర్పయాగం, కర్తవ్యం మాదిరిగా ఈ సినిమా
నిలుస్తుంది. ఇది సాధారణ యువకుల జీవితం ని ఆవిష్కరించే కథ ' అన్నారు.

రంగు కథ కోసం కలం నటుడు షఫి మాట్లాడుతూ:

రంగు కథ కోసం కలం నటుడు షఫి మాట్లాడుతూ:

‘‘పదేళ్ల క్రితం సిరివెన్నెల అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్ర
మందామా అనే పాట తర్వాత ఇప్పుడ ఎక్కడ ఉంది చిక్కుముడి అని సమాజాన్ని ప్రశ్నించేటట్లు , ఒడిదుకులు గురించి అంత అద్భుతంగా రంగు కథ కోసం ఆయన
కలం కదిలింది. అలాగే దర్శకుడు కార్తికేయ ఈ కథ కోసం పడిన తపన అంతా ఇంతా కాదు. యూనిట్
అందరికీ కథను ఇంజెక్ట్ చేసాడు దర్శకుడు కార్తికేయ. తనీష్ కి ఈ సినిమా జీవితంలో ఎన్నో రంగులు నింపాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

ఇండ‌స్ట్రీలోకి వ‌స్తాన‌ని అనగానే

ఇండ‌స్ట్రీలోకి వ‌స్తాన‌ని అనగానే

నిర్మాత ప‌ద్మ‌నాభ‌రెడ్డి మాట్లాడుతూ - ``నేను సినిమా ఇండ‌స్ట్రీలోకి వ‌స్తాన‌ని అన‌గానే వీడికేమైంది? సినిమా ఇండ‌స్ట్రీలోకి వెళ‌తానంటున్నాడు అని అనుకున్నారు. కానీ మ‌నిషికి దేవుడు ఓ బ్రెయిన్‌ని ఇచ్చాడు. కేవ‌లం
పుట్టి.. పెరిగి.. పెళ్లి చేసుకుని, పిల్ల‌ల్ని క‌ని, పెద్ద చేసి
చ‌నిపోవ‌డానికే మ‌నిషి ఆ బ్రెయిన్‌ని వాడ‌కూడ‌దు. ఏదైనా కొత్త‌గా చేసి చూపించాలి. అలా చేసిన‌ప్పుడే అంద‌రూ మ‌న‌ల్ని గుర్తు పెట్టుకుంటారు. ఓ కొత్త‌ బ్యాన‌ర్‌ను పెట్టుకుని కొత్త వారితో సినిమాలు చేయాల‌నుకుంటున్నాం. మా సినిమా వ‌ల్ల ఎవ‌రికీ న‌ష్టం రాదు.. రానివ్వ‌ను అని అన్నారు.

ప్రిరిలీజ్‌కు హాజరైన ప్రముఖులు

ప్రిరిలీజ్‌కు హాజరైన ప్రముఖులు

రంగు ప్రీ రిలీజ్ కార్య‌క్ర‌మంలో సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, హీరోయిన్ ప్రియా సింగ్‌, మ‌ల్కాపురం శివ‌కుమార్‌, ర‌వి, రామ‌ స‌త్య‌నారాయ‌ణ‌, యోగీశ్వ‌ర శ‌ర్మ‌, సామ్రాట్‌, రాజ్‌కందుకూరి త‌దిత‌రులు పాల్గొన్నారు.తనీశ్‌, ప‌రుచూరి ర‌వి, ప్రియా సింగ్‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు,పోసాని కృష్ణ‌ముర‌ళి, ష‌ఫీ, టార్జాన్‌, ర‌ఘు కారుమంచి, హ‌రిబాబు,త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌: టి.సురేంద‌ర్ రెడ్డి,
డైలాగ్స్‌: ప‌రుచూరిబ్ర‌ద‌ర్స్ నిర్మాత‌లు: ఎ.ప‌ద్మ‌నాభ రెడ్డి, న‌ల్ల అయ‌న్న నాయుడు,
క‌థ‌,స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: కార్తికేయ‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X