పరుచూరి ఇంట్లో విషాదం.. చిరంజీవి పరామర్శ
తెలుగు చిత్ర సీమలో పరుచూరి బ్రదర్స్ అంటే తెలియని వారెవ్వరూ ఉండరు. దాదపు 350కి పైగా చిత్రాలకు కథ, మాటలు, కథనాన్ని అందించిన ఘనత వారిది. అలాంటి పరుచూరి ఇంట్లో నేడు విషాదం నెలకొంది. పరుచూరి వెంకటేశ్వరరావు సతీమణి విజయలక్ష్మి(74) గుండెపోటుతో కన్నుమూశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు పరుచూరిని పరామర్శిస్తున్నారు. ఈ మేరకు చిరంజీవి పరుచూరిని ప్రత్యేకంగా పరామర్శించినట్టు తెలుస్తోంది.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని స్వగృహంలో మృతి చెందారు. విజయలక్ష్మి మరణవార్త తెలిసిన వెంటనే చిరంజీవి తన సంతాపాన్ని ప్రకటించారు. ఈ మేరకు వెంకటేశ్వరావుకు ఫోన్ చేసి పరామర్శించారు. తన ప్రగాఢ సానభూతిని తెలిపారు. పరుచూరి వెంకటేశ్వరరావు తనకు ఎంతో ఆత్మీయుడని, ఆ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. విజయలక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని చిరంజీవి అన్నారు.

ఇక పరుచూరి వెంకటేశ్వర రావు సతీమణి మరణించడంతో గోపాల కృష్ణ సోషల్ మీడియా టీం కూడా స్పందించింది. 'పరుచూరి వెంకటేశ్వరరావు గారి ధర్మ పత్ని పరుచూరి విజయలక్ష్మి గారు ఇవాళ ఉదయం గుండెపోటు తో మరణించారు అని తెలియజేయుటకు చింతిస్తున్నాము' అని సోషల్ మీడయాలో ట్వీట్ చేసింది. సినీ ప్రముఖులెందరో పరుచూరిని ఓదార్చుతున్నారు.


Click it and Unblock the Notifications











