నిన్నటి నుంచి వెబ్ లో రేపటి నుంచి థియోటర్లలలో

బొమ్మరిల్లులో తండ్రి, కొడుకు మధ్య ఉండే సున్నితమైన అంశాన్ని తెరకెక్కించినట్టే ఈ చిత్రంలో తండ్రి, కూతురి మధ్య సంబంధాన్ని తెరకెక్కించారట. అలాగే దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌కు ఇది రెండో చిత్రం. ఇక తొలిచిత్రం గంగోత్రి నుంచి దేశముదురు దాకా ప్రతి సినిమాను వైవిధ్యంగా మలుచుకుని విజయాన్ని సొంతం చేసుకుంటూ వస్తున్న ఎనర్జీ హీరో అల్లు అర్జున్ . అంతేగాక అపజయం అనేది ఎరగకుండా దూసుకుపోతున్న దిల్ రాజు ఈ చిత్ర నిర్మాత. దాంతో ఈ కాంబినేషన్ పై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. అల్లు అర్జున్ కెరీర్‌లో మరో ఉత్తమ చిత్రంగా భావిస్తున్న ఈ చిత్రం ఆడియోను అతని పుట్టిన రోజైన ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఈ ఆడియోను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు. పాటలు ప్రతీ ఇంట్లో ఆటోలో మారుమ్రోగుతున్నాయి.ఇలాంటి అనేక ప్రత్యేకతలున్న ఈ చిత్రం గురువారం నుంచి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సందడి చేయనుంది.


Click it and Unblock the Notifications











