హైదరాబాదులోని దుర్గం చెరువు రిసార్ట్స్‌లో జరిగిన 'పరుగు' ఆడియో పంక్షన్ కి చిరంజీవి హాజరై ఆడియో క్యాసెట్లను ఆవిష్కరించారు. అల్లు అర్జున్, షీలా జంటగా బొమ్మరిల్లు భాస్కర్ రూపొందించిన ఈ సినిమా ఆడియోని ఆదిత్యా మ్యూజిక్ వారు మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు.ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్, దిల్ రాజు,భాస్కర్, షీలా, అనంత్ శ్రీరామ్, ప్రకాష్‌రాజ్, కె.ఎల్. నారాయణ, సుకుమార్, భోగవల్లి ప్రసాద్, శానం నాగ అశోక్‌కుమార్, వంశీ పైడిపల్లి, తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ 'తను నమ్మిన సబ్జెక్టుకు తగిన తారల్ని ఎంచుకుని చక్కని నిర్మాణ విలువలతో సినిమాల్ని నిర్మిస్తున్నారు' అంటూ నిర్మాత దిల్ రాజును మెచ్చుకున్నారు.అలాగే దర్శకుడు భాస్కర్ మంచి పనితనాన్ని చూపించి ఉంటారంటూ ఆశాభావం వ్యక్తం చేసారు. ఇక మణిశర్మ అందించిన సంగీతానికి తన మేనల్లుడు అల్లు అర్జున్ ఏ రేంజిలో డాన్స్ చేసుంటాడో అని చమత్కరించారు.ఈ కార్యక్రమం అల్లు అర్జున్ జన్మదినమైన ఏప్రిల్ 8న జరగటంతో అభిమానులు ఉత్సాహంతో పాల్గొన్నారు.