పార్వతికి అవకాశం రాలేదట
తెలుగులో మెరిసిన తార పార్వతి మెల్టన్ ఇపుడు తమిళంలో కొంచెం బిజీ అయిపోయింది. ఆమెకు యువ అగ్రనటుడు అజిత్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా పేరు అక్బర్. అజిత్ తో నటించే అవకాశం లభించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన పార్వతి ఇపుడు ప్లేట్ ఫిరాయించింది. అక్బర్ సినిమాలో అవకాశమే రాలేదని తేల్చిచెప్పింది. ఈ సినిమాకు సంబంధించి ఇంతవరకు తననెవరూ సంప్రదించలేదని అంటోంది. వస్తే సంతోషంగా చేస్తానని అంది. ప్రస్తుతం పార్వతి తమిళంలో పూ అనే సినిమాలో చేస్తోంది.


Click it and Unblock the Notifications











