ఓన్లీ మహేష్ బాబు వరకే..ఆమె రూటు వేరు
దూకుడు సినిమాలో 'పువ్వాయ్ పువ్వాయ్" ఐటం సాంగులో థియేటర్ ను షేక్ చేసిన భామ పార్వతి మెల్టన్. ఎక్స్‌ట్రార్డినరీ ఎక్స్‌ఫోజింగ్‌తో ప్రేక్షకుల కళ్లు తిప్పుకుండా ఊపేసింది. ఈ ఐటం సాంగు దూకుడు సినిమాకే హైలెట్ గా నిలిచింది. చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించడం, గతంలోకంటే స్లిమ్ గా, అందంగా తయారవ్వడంతో పార్వతికి ఐటం సాంగుల అవకాశాలు వరదలా తన్నుకొస్తున్నాయి. అయితే పార్వతి మాత్రం తొందర పడి ఏ ఆఫర్ ను స్వీకరించడం లేదు. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పార్వతి టార్గెట్ ఐటం సాంగులు చేయడం కాదు. చిన్న సినిమానో, పెద్ద సినిమానో హీరోయిన్ లేదా, మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు కోసం ఎదురు చూస్తోంది.
మరి అలాంటి ఉద్దేశ్యం ఉంటే.... మహేష్ బాబు సినిమాలో మాత్రం ఐటం సాంగు ఎందుకు చేశారు అని అడిగితే మాత్రం పార్వతి కసురుకుటోందట. అది నా ఇష్టం, మహేష్ బాబు ఈజ్ మై ఫెవరెట్, అతనితో నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఈ క్రమంలో దూకుడు సినిమాలో అవకాశం రావడంతో కాదనలేక పోయాను, ఐటం సాంగుల సంగతి మహేష్ వరకు మాత్రమే, ఇకపై అలాంటి చేయను అంటోందట. అయితే సినీ జనాలు మాత్రం మరోలా అంటున్నారు. ఇలా అయితే పార్వతికి భవిష్యత్ ఉండదని, ప్రస్తుతం శ్రియ లాంటి వారే అవకాశాలేక ఐటం సాంగులు చేస్తున్నారు. మరి పార్వతి తన నిర్ణయం మార్చుకుంటుందో? ఆమె భవిష్యత్ ఎలా ఉంటుందో..? వెయిట్ అండ్ సీ...


Click it and Unblock the Notifications











