మహేష్ కోసమే ఆ సినిమా చేసానంటూ ఆమె ఫైరింగ్
హైదరాబాద్ : ''నేను కేవలం మహేష్ కోసమే 'దూకుడు'లో ఐటమ్ సాంగ్ చేశాను. తనతో హీరోయిన్ గా నటించే ఛాన్స్ అనుకోకుండా మిస్ చేసుకున్నాను. ఆ లోటును కొంత వరకూ భర్తీ చేసుకోవడానికే ఐటమ్ సాంగ్ చేశాను. అనుకోకుండా దానికి మంచి అప్లాజ్ వచ్చింది. అది సంతోషించదగ్గ విషయమే.
అయితే.. నేను ఐటమ్ నంబర్‌గానే స్థిరపడతానని ఎవరికీ చెప్పలేదు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు నా దగ్గరకు రావడం అంటూ ఫైర్ అవుతోంది పార్వతీ మిల్టన్.
'దూకుడు'లో తను చేసిన ఐటమ్ సాంగ్‌కి అనూహ్యమైన స్పందన రావడంతో తమ సినిమాల్లో ఐటమ్ నంబర్ చేయమని ఫ్యాన్సీ ఆఫర్లతో పార్వతి మిల్టన్ వద్దకు చాలా మంది దర్శక, నిర్మాతలు వస్తున్నారు. ఓ అగ్ర నిర్మాత అయితే ఏకంగా పాతిక లక్షలు ఆఫర్ చేశారని సమాచారం. కానీ ఆ ఆఫర్‌ని పార్వతి సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది. అంతేగాక..దయచేసి ఐటమ్ సాంగ్స్ కోసం అయితే నా దగ్గరకు రావొద్దు. నేను ఐటమ్ బాంబ్‌ని కాదు'' అంటూ నిర్మొహమాటంగా చెప్పేసింది.
ప్రస్తతం ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ...హీరోయిన్ గా నేను బిజీగానే ఉన్నాను. బాలకృష్ణ లాంటి పెద్ద స్టార్ సరసన 'శ్రీమన్నారాయణ' చేశాను. 'యమహో యమః' ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇంకా కొన్ని సినిమాలు చర్చల దశలోఉన్నాయి. ప్రస్తుతం ఐటమ్ సాంగ్స్ చేసేంత తీరిక కూడా నాకైతే లేదు'' అంది.
ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో ఎల్లో ఫ్లవర్ పతాకంపై రమేష్ పుప్పాల 'శ్రీమన్నారాయణ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత తెలియజేస్తూ 'బాలకృష్ణ కెరీర్‌లో సంచలనాత్మకమైన చిత్రంగా 'శ్రీమన్నారాయణ'ను తీర్చిదిద్దుతున్నాం అన్నారు. ఈ చిత్రానికి మాటలు: ఘటికాచలం, కెమెరా: సురేందర్ రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్ : నాగేందర్, కో డైరెక్టర్ : సురేష్ కుమార్, నిర్మాత : పుప్పాల రమేష్, కథ, కథనం, దర్శకత్వం : రవికుమార్ చావలి.


Click it and Unblock the Notifications