పార్వతి మిల్టన్ ఇంతకాలానికి మళ్ళీ తెలుగులో
జల్సా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తనను ఉద్దరిస్తాడని వెయిట్ చేసి అలిసిపోయిన పార్వతి మిల్టన్ ని తర్వాత ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు.అలా మిగిలిన ఆమె ఇన్నాళ్ళకి మరో ఆఫర్ వచ్చింది.సాయిరామ్ శంకర్ హీరోగా జి.వి.కె.ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రంలో ఆమె హీరోయిన్ గా బుక్కైంది. ఇక జి.వి.కె.ఆర్ట్స్ సంస్థ గతంలో ముమైత్ ఖాన్ తో "పున్నమి నాగు" చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ చిత్రంలో యమ ధర్మరాజు గా శ్రీహరి ప్రధాన పాత్రలో నటించనున్నారు.
జితేందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబరులో మొదలై అమెరికాలో 40రోజులు ఏకధాటిగా షూటింగ్ జరుపుతారు. డిశంబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తారు.నిర్మాత జి.విజయ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ ''చక్కటి సోషియో ఫాంటసీ కథాంశమిది. గతంలో యముడు - చిత్రగుప్తుడు నేపథ్యంతో వచ్చిన చిత్రాలన్నీ మంచి విజయం సాధించాయి. వినూత్న రీతిలో సాగే ఈ కథ కూడా ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తుంది. యముడు - చిత్రగుప్తుడు అమెరికాలో చేసే సందడి సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అన్నారు. ఈ చిత్రానికి రచన: వెలిగొండ శ్రీనివాస్, ఛాయాగ్రహణం: ప్యాట్రిక్, కూర్పు: మార్తాండ్.కె.వెంకటేష్, సంగీతం: శివరంజని.


Click it and Unblock the Notifications











