సెన్సార్ చూసుకుంటుంది: 'దూకుడు' పై పార్వతి మిల్టన్
మహేష్ బాబు తాజా చిత్రం దూకుడు లో పార్వతీ మిల్టన్ ఓ ఐటం సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పాట బాగా మితిమీరి చిత్రీకరిస్తున్నారని, పార్వతి గ్లామర్ మోతాదు మించి ఒలక పోస్తోందని చెప్పుకుంటున్నారు. ఈ విషయమై మీడియా వారు పార్వతి మిల్టన్ ని సంప్రదిస్తే ఆమె మాట్లాడుతూ...పాట సిట్యేషన్‌ని బట్టి కాస్త గ్లామర్‌గానే కనిపించాలి. గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు గ్లామర్‌గా కనిపించకపోతే ఎలా?. అంతగా మోతాదు మించితే... ఎడిట్ చేయడానికి సెన్సార్ ఉందిగా అంది. అలాగే బాలీవుడ్‌లో పెద్ద పెద్ద స్టార్‌హీరోయిన్లే ఐటమ్ నంబర్స్ చేస్తున్నారు. నేను చేస్తే అదేదో పెద్ద నేరంలా భావిస్తున్నారేంటి?. మహేష్ నా ఫేవరెట్ స్టార్. తనతో హీరోయిన్‌గానే చేయాల్సింది. కానీ కుదర్లేదు. అందుకే తనతో సాంగ్ అనగానే ఓకే అనేశాను అని చెప్పుకొచ్చింది. ఐటమ్ నంబర్‌లో డాన్స్ చేస్తున్నందకు తానేం బాధ పడటం లేదని, ఒక్కపాటలో నర్తించినా, ఆ పాట ద్వారా తన గ్లామర్ సత్తా ఏంటో నిరూపిస్తానని పార్వతి చెప్పింది.
నీ దూకుడు...సాటెవ్వడు అంటూ అదిరిపోయే లెవెల్లో ఆడియో ఫంక్షన్ చేసేశారు. అంతకన్నా ఘనంగా 23న భారీ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమైపోతున్నారు.తన తాజా చిత్రం దూకుడు గురించి మహేష్ బాబు చాలా గ్యాప్ తర్వాత ట్వీట్ చేసారు. ఆయన మాటల్లోనే.. మా డైరక్టర్ మాటల ప్రకారం దూకుడు ఫస్టాఫ్ ఆర్.ఆర్ అవుట్ స్టాండింగ్. తమన్ కే ఈ ప్రశంసలు అన్నీ దక్కుతాయి. ధాంక్యూ తమన్.సెకెండాఫ్ కూడా ఇంతకన్నా బాగా చేస్తాడని ఆసిస్తున్నాను.నా వరకూ చెప్పాలంటే నేను గ్రేట్ వర్క్ చేస్తున్న ఫీలింగ్ లో ఉన్నాను. పని..పని..పని అన్నట్లుంది అన్నారు.ఇక ఈ చిత్రంలో మహేష్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. కామిడి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ, కోన వెంకట్ మాటలు అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











