For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇక పార్వతికి పవన్ దిక్కు?

  By Staff
  |

  పార్వతి మిల్టన్ కి త్రివిక్రం హ్యాండ్ ఇచ్చాక ఆమె తెర మరుగు ఐపోయింది. ఒక్క తెలుగు సినిమా కూడా కమిట్ కాలేదు. ఐతే తాజాగా పవన్ కళ్యాణ్ ప్రక్కన కొమరం పులి చిత్రం లో సెకండ్ హీరోయిన్ గా చేయనుందని వినపడుతోంది. నిజానికి జల్సా సమయంలో పవన్ పెద్దగ పట్టించు కోలేదు. కాని సినిమా రిలీజ్ అనంతరం పవన్ ఆమకు మంచి గిఫ్ట్ ఇచ్చరంటు ప్రచారం జరగింది. కాని తర్వాత త్రివిక్రం ఆమెను తీసివేసి అనుష్క ను పెట్టుకున్నాక ఆమె అలిగి అమెరికా వెళ్లి పోయింది. అమెరికా వెళ్లి కొన్నాళ్లపాటు కుటుంబంతో గడిపిన ఈ అందాల భామ ఇటీవల అందాల భామ ఇటీవల హైదరాబాద్‌కి వచ్చింది. కొద్ది రోజులు ఉండి...ముంబయి వెళ్లిపోయింది. హిందీ చిత్రాల్లో నటించాలని పార్వతి ఉత్సాహపడుతోందని కొందరు అంటున్నారు. అందుకే అక్కడ ఉండి అవకాశాల వేటలో ఉన్నట్లు చెప్తున్నారు. మహేష్‌ సినిమాపై ఆశలు పెంచుకొన్న ఆమెకు అవకాశం దక్కకపోవడంతోనే ఇక బాలీవుడ్‌పై దృష్టిపెట్టిందని తెలుగు సినీ వర్గాలు అంటున్నాయి. అయితే పవన్ తో అవకాసం రావటం తో మల్లి అక్కడు వచ్చే అవకాసం ఉందని అంచనా.

  వన్ కళ్యాణ్ హీరోగా ఖుషి ఫేమ్ ఎస్.జె.సూర్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పులి'కథ గురించి ఫిల్మ్ నగర్ లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. వాటిల్లో ఎక్కువగా వినపడుతున్నది...ఇలా ఉంది. పవన్ కళ్యాణ్ పోలీస్ కమీషనర్ గా చేస్తూ ప్రధాన మంత్రి సభకు సెక్యూరిటీ భాధ్యతలు స్వీకరించి ఆయన్నుప్రాణాలకు తెగించి ఓ టెర్రరిస్ట్ ఎటాక్ నుండి రక్షిస్తాడు.దాంతో అతనికి గోల్డ్ మెడల్ ఇస్తూ...గౌరవ వందనం ఇస్తారు. అంతేగాక ఆయన మెచ్చుకుంటూ తన ప్రాణాలకు రక్షించినందకు పవన్ ని ఏదైనా కోరుకోమంటాడు. అప్పుడు పవన్ ఓ సహాయం అర్దిస్తాడు.

  దేశంలో అరాచకం అణుద్దామని ప్రయత్నించిన ప్రతీసారీ రాజకీయనాయకుల వల్ల మిగతా వారి వల్ల సమస్యలు వస్తున్నాయని అందుకే తనకు ప్రత్యేకమైన అథికారాలు ఇస్తే ఏదైనా చెయ్యగలను అంటాడు. అప్పుడాయన ఓ.కె అంటాడు. అక్కడ నుండి పవన్ పులి టీమ్ అని ఏర్పాటు చేసి మాటు వేసిన చిరుతపులిలా సంఘవ్యతిరేక శక్తులను చీల్చిచెండాడుతూంటాడు. అయితే చివరకు అతనికో నిజం తెలుస్తుంది.

  అది ప్రధానమంత్రి కూడా ఆ విలన్స్ తో చేతులు కలిపాడని. అంతే ఆయనకు ఎదురుతిర్గుతాడు. అక్కడనుండి హోరో హీరీ పోరాటం జరిగి గెలిచి అందరి మన్ననలూ పొందుతాడు. ఇక హీరోయిన్ కూడా పోలీస్ డిపార్టెమెంట్ లోనే ఉంటుంది. ఎప్పుడూ ఇంట్రావర్ట్ గా ఉండే అతన్ని సరదాగా ఉండే మనిషిని చేసి కర్తవ్యోన్ముఖురాలిని చేస్తుంది. అలాగే హీరోకి చిన్నప్పుడు వచ్చి ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా ఆర్ద్రంగా ఉంటుందని తెలుస్తోంది. మరి అదీ కథ.ఇది కరెక్టే అవటానికి ఎంత అవకాశం ఉందో కాకపోవటానికి కూడా అంతే అవకాశముంది.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X