మహేష్ రిజెక్ట్..ఎన్టీఆర్ తో

By Staff

Parvathi milton
మహేష్ బాబు తన వరుడు చిత్రం కోసం రిజెక్టు చేసిన పార్వతి మిల్టన్ త్వరలో ఎన్టీఆర్ చిత్రంలో కనిపించనుందని సమాచారం. నల్లమలుపు బుజ్జి ప్రతిష్టాత్మకంగా భావించి రూపొందించనున్న ఎమ్మెల్యే చిత్రంలో ఈ కాంబినేషన్ సెట్ కానుందని తెలుస్తోంది. ఈ విషయం పార్వతి తన సన్నిహితులుతో చెప్పి మురిసిపోయిందని ఫిల్మ్ నగర్ టాక్. ఇక ఎమ్మెల్యే చిత్రాన్ని హరీష్ శంకర్ డైరక్ట్ చేస్తున్నాడు.

ఎన్టీఆర్ తో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న వి.వి.వినాయిక్ చిత్రం ఓ కొలిక్కి రావటంతో హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో చిత్రానికి ఆయన పచ్చ జెండా ఊపారు.నిర్మాతగా నల్లమలుపు బుజ్జి ముందుకొచ్చారు. ఆ సినిమాకే టైటిల్ ఎమ్మెల్యే అనుకుంటున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి.ఎం ఎల్ ఎ టైటిల్ అర్దం మంచి(ఎం)లక్షణాలు(ఎల్)ఎ(అబ్బాయి) అని వారి భావమట. మణిశర్మ సంగీతం అందించే ఈ చిత్రం త్వరలోనే ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

గతంలో నల్లమలుపు బుజ్జి గతంలో ఎన్టీఆర్ తో సూపర్ హిట్ ఆది చిత్రాన్ని రూపొందించారు. అలాగే ఆయన చింతకాయల రవి చిత్రానికి హరీష్ పని చేసారు. అలాగే టైటిల్ మాత్రమే రాజకీయాల్ని గుర్తు చేస్తుందా లేక సినిమా కూడా రాజకీయాలచుట్టూ తిర్గుతుందా అనేది ఇంకా తెలియరాలేదు. అయితే మాత్రం సినిమాలో పొలిటికల్ సెటైర్స్ మాత్రం ఉంటాయిని అంటున్నారు. ఇక ఈ సినిమాలో మరో విశేషముంది. పెద్ద ఎన్టీఆర్ ని గాడ్ ఫాదర్ గా చెప్పే రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో ఎన్టీఆర్ కి తండ్రిగా చేయబోతున్నారు.

అయితే బుజ్జిగాడు కి పూరీతో పనిచేసిన హరీష్ కథ అధ్బుతంగా చెబుతాడని ప్రతీతి. అందుకే వర్మ సైతం షాక్ సినిమా ఇచ్చాడని తర్వాత పూరీ చేరతీసాడని చెప్తారు. తర్వాత పూరీ బుజ్జిగాడు ఘోర పరాజయంతో ఆయన బయటకు వచ్చాడు. అలాగే ప్రస్తుతం నల్లమలుపు బుజ్జి కొంచెం ఇష్టం..కొంచెం కష్టం సినిమా ప్రమోషన్ చేస్తూ స్క్రిప్టు చేయస్తున్నారు. ఇక ఇప్పుడు పార్వతి మిల్టన్ తో ప్రారంభించి నటీనటులు ఎంపిక కూడా జరుగుతోందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X