»   » పిచ్చెక్కించింది: టూపీస్ బికినీలో "వెన్నెల" పిల్ల

పిచ్చెక్కించింది: టూపీస్ బికినీలో "వెన్నెల" పిల్ల

Posted By:
Subscribe to Filmibeat Telugu

పార్వ‌తి మెల్ట‌న్ గుర్తుందా? .. దేవాక‌ట్టా వెన్నెల సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ ఎన్నారై భామ అదిరిపోయే డ్యాన్స‌ర్‌. క్లాసిక్‌, సినీ డ్యాన్సుల్లో ర‌ఫ్ఫాడించేస్తుంది. తొలి ఎటెంప్ట్.. వెన్నెల బంప‌ర్ హిట్ కొట్టాక వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకున్న ఈ భామ‌.. ఆ త‌ర్వాత కెరీర్‌లో ఊహించ‌ని మలుపులతో కెరీర్ పాడు చేసుకుంది..

జ‌ల్సా లో

జ‌ల్సా లో

ప‌వ‌న్ క‌ల్యాణ్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో "జ‌ల్సా" లో సెకండ్ లీడ్‌లో న‌టించింది. అయితే ఆ త‌ర్వాత ప‌వ‌న్‌, మహేష్ లాంటి స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేసి విసిగిపోయింద‌ని చెప్పుకున్నారు. తాను ఎంత అడిగినా త్రివిక్ర‌మ్ మ‌ళ్లీ పార్వ‌తికి ఛాన్సివ్వ‌లేద‌ని, అందుకు అలిగి యూఎస్ వెళ్లిపోయింద‌ని ప్ర‌చార‌మైంది.

దూకుడు

దూకుడు

అయితే ఆ క్ర‌మంలోనే చాలా కాలానికి శ్రీ‌నువైట్ల `దూకుడు`లో అవ‌కాశం ద‌క్కింది. మ‌హేష్ స‌ర‌స‌న "ఆటో అప్పారావు .. " అంటూ ఐటెమ్ సాంగేసుకుంది. కానీ ఏం లాభం.. ఆ త‌ర్వాత క‌నీసం ఐటెమ్ అవ‌కాశాలు కూడా రాలేదు. దాంతో మ‌రోసారి అలిగి అమెరికా వెళ్లిపోయింద‌ని చెప్పుకున్నారు.

టూపీస్ బికినీ పోజులు

టూపీస్ బికినీ పోజులు

పార్వ‌తి గ్లామ‌ర్‌కి ఆదరణ బాగానే వచ్చినా అదృష్ట‌మే క‌లిసి రాలేదు అమ్మ‌డికి ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసిన పార్వతి మెల్టన్.. పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైపోయింది. దాదాపు ఐదేళ్లుగా వెండితెరకు దూరమైపోయి.. పెద్దగా వినిపించకుండా పోయిన పార్వీత మెల్టన్.. ఇప్పుడు హఠాత్తుగా హాట్ టాపిక్ అయిపోవడానికి కారణం.. టూపీస్ బికినీలో ఆమె ఇచ్చిన పోజులే.

మైక్రో బికినీలో

మైక్రో బికినీలో

ఈసారి అదిరిపోయే స్విమ్ సూట్ లో దిమ్మ‌తిరిగే ట్రీటిచ్చింది. సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన‌ ఈ ఫోటోషూట్ వైర‌ల్ అవుతోంది. రీసెంట్ గా వెకేషన్ కు వెళ్లిన పార్వతి సిల్వర్ కలర్ మైక్రో బికినీలో మిలమిలా మెరిసిపోయింది. ఇన్నేళ్లు గడిచినా తన శరీరంలోని కొలతలు.. మెలికలు ఏ మాత్రం తగ్గలేదని చెప్పకనే చెప్పింది దూకుడు బ్యూటీ.

ఆశగానే ఉన్నారు

ఆశగానే ఉన్నారు

మరి ఇన్నేళ్ల తర్వాత ఇంత హాట్ అండ్ సెక్సీ లుక్స్ తో పోజులు ఇవ్వడానికి కారణం.. మళ్లీ సినిమాలు చేయడానికి రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమా అనిపించకమానదు. పారూని ఇలా చూశాకైనా మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు వెంట‌ప‌డ‌తారేమో చూడాలి. మళ్ళీ పార్వతీ మెల్టన్ వెండి తెరమీద మెరిస్తే చూద్దామని ఆశగానే ఉన్నారు ఆమెకు ఉన్న కొద్ది మంది అభిమానులు.

English summary
Parvathy Melton Who enterd in Tollywood With Deva Katta's vennela Movie Posted her Hot & Spicy Real Life Bikini Pics
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu