సుమంత్ సరసన పార్వతి
శతాధిక చిత్రాల నిర్మాత డాక్టర్ డి. రామానాయుడు తాజాగా తమ మనవడు సుమంత్ హీరోగా నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభం అవుతోంది. ఈ చిత్రంలో ఇప్పటికే స్నేహ హీరోయిన్‌గా ఎంపిక కాగా, ఇప్పుడు పార్వతి మెల్టన్ కూడా రెండో హీరోయిన్‌గా ఎంపికయింది.
ఆ నలుగురు చిత్రం ద్వారా పేరు తెచ్చుకున్న దర్శకుడు చంద్రసిద్ధార్థ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రమణ గోగుల సంగీతం సమకూర్చనున్నారు. ప్రముఖ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి రాసిన ఒక కథ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కెమెరా సుధాకర్.
వెన్నెల చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పార్వతి మెల్టన్ గేమ్ చిత్రంలో తన అందచందాల ద్వారా యువహృదయాలను అలరించి వరుసగా సినిమాలు చేజిక్కించుకుంటోంది. ప్రస్తుతం ఆమె అల్లరి నరేశ్, వేణు, మల్లికా కపూర్‌లతో కలిసి అల్లరే అల్లరి చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications