మహేష్ బాబు..త్రివిక్రమ్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న చిత్రంలో పార్వతి మిల్టన్ మెయిన్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె పాత్ర సినిమాలో మిస్ యూనివర్స్. ఆమె..టాక్సీ డ్రైవర్ అయిన మహేష్ తో ప్రేమలో పడుతుంది. కనకరత్నా మూవిస్ బ్యానర్ పై శింగనమల రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే భారి క్రేజ్ ఏర్పడింది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా త్రివిక్రమ్ తన దైన పంచ్ డైలాగుల స్క్రిప్టుతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. పంతొనిమిది నుండి రామోజి ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకోనుంది. ఇక ఈ చిత్రం అతిధి పరాజయం అనంతరం చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న కావటంతో చాలా కసితో ఎలా అయినా సూపర్ హిట్ కొట్టాలనే కసితో మహేష్ చేయనున్నాడని చెప్తున్నారు. అయితే నాగార్జున,దీపికా బట్నాగర్ కాంబినేషన్ వచ్చిన ఆటో డ్రైవర్ సినిమాలోనూ ఈ తరహా పాత్రలే ఉండటం గమనార్హం.