»   » ఫితూర్: కత్రినా కైఫ్ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ (వీడియో)

ఫితూర్: కత్రినా కైఫ్ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: కత్రినా కైఫ్, ఆదిత్యరాయ్ కపూర్ జంటగా అభిషేక్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫితూర్' . సినిమా ప్రమోషన్లో భాగంగా ఇప్పటికే ‘యే ఫితూర్ మేరా' సాంగును విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘పష్మినా' అనే మరో సాంగ్ రిలీజ్ చేసారు. ఈ సాంగులో కత్రానా, ఆదిత్య రాయ్ కపూర్ పెర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది.

ఫితూర్ చిత్రాన్ని ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 12న విడుదల చేస్తున్నారు. ప్రేమికులకు సరిగ్గా రెండు రోజుల ముందు విడుదల చేయడం ద్వారా బిజినెస్ పరంగా కలిసొస్తుందని భావిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ విడుదల చేయగా భారీ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ విడుదలైన 24 గంటల లోపే మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.

ఈ సినిమాలో టబు కూడా నటిస్తోంది. ఇందులో ఆమె పాత్ర విల‌క్ష‌ణ‌ంగా ఉండబోతోంది. సినిమాలో ఆమె పాత్ర పేరు బేగం. ఈ చిత్రాన్ని చార్లెడ్ డికెన్స్ రచించిన ‘గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్స్' నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు అభిషేక్ కపూర్. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

హీరో ఆదిత్య రాయ్ కపూర్ సిక్స్ ప్యాక్ బాడీతో హరింత హాటుగా కనిపించబోతున్నాడు. అతనితో పోటీ పడేలా కత్రినాను కూడా సూపర్ హాట్ అండ్ సెక్సీగా ప్రజెంట్ చేసాడు దర్శకుడు. ఇక సినిమాలో రిమాంటిక్ సీన్లు ఎక్కువగా ఉంటాయనే ప్రచారం జరుగుతుండటం కూడా యువతలో సినిమాపై ఆసక్తి పెరిగేలా చేస్తున్నాయి.

English summary
Watch this mesmerizing romantic song "Pashmina" from the movie Fitoor sung by Amit Trivedi.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu