twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షూటింగ్ లో ప్రమాదం

    By Staff
    |

    Pasupathi
    వైరం అనే మళయాళ సినిమా షూటింగ్లో జరిగిన ప్రమాదం లో క్యారెక్టర్ ఆర్టిస్టు పశుపతి బాగా గాయపడినట్లు సమాచారం. వెంటనే ప్రెవేట్ హాస్పటిల్ లో చేర్చిన యూనిట్ సభ్యులు వారం రోజుల్లో అంతా సెట్ అవుతుందని డాక్టర్ చెప్పారని తెలుస్తోంది. ఈ ప్రమాదం క్లైమాక్స్ ఫైట్ తీస్తున్నప్పుడు చోటు చేసుకుంది. సర్పయాగం వంటి కదాంశంతో ఈ చిత్రం రూపొందుతోందని, తన పదహారేళ్ళ కూతుర్ని బలవంతగా రేప్ చేసి చంపిన వారిపై పగ తీర్చుకునే పాత్రలో పశుపతి చేస్తున్నారు. ఇక ముమ్మట్టి స్టైలిష్ ఫిల్మ్ బిగ్ బి చిత్రంలో చేసిన పశుపతికి కేరళలో మంచి క్రేజ్ వచ్చింది. దాంతో ఈ చిత్రం మంచి మార్కెట్ చేస్తుందని అంతా భావిస్తున్నారు. ఇక పుశుపతి త్వరగా కోలుకోవాలని తమిళ నటులు కొందరు సందేశాలు పంపుతున్నారు. ప్రముఖ నటుడు కమల్ హాసన్ సైతం వెంటనే రియాక్టయి ఫోన్ చేసి విషయం కనుక్కున్నారని తెలుస్తోంది. ఇక ఈ వైరం చిత్రాన్ని MA Nishad డైరక్ట్ చేస్తున్నారు. ఆయన భార్యగా మీరా వాసుదేవన్ చేస్తోంది. ఇక త్వరగా పశుపతి కోలుకోవాలని దట్స్ తెలుగు కోరుకుంటుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X