Just In
Don't Miss!
- Finance
IMF చీఫ్ గీతా గోపినాథ్‌పై అమితాబ్ వ్యాఖ్యలు, ఏం మాటలు అంటూ నెటిజన్ల అసహనం
- News
ఎస్సై ఆత్మహత్యను రాజకీయంగా వాడుకుంటారా ? చంద్రబాబు, దేవినేని ఉమపై పోలీస్ అధికారుల సంఘం ధ్వజం
- Sports
టీమిండియా ఆటగాళ్లకు మరో కొత్త టెస్ట్.. 8 నిమిషాల్లోనే 2 కిమీ!! ఎన్నిసార్లంటే?
- Automobiles
భారత్‌లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్‌క్రాస్ విడుదల
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'పటాస్' రిలీజ్ డేట్.... వచ్చేసింది
హైదరాబాద్: నందమూరి కల్యాణ్.. పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో తెరకెక్కిన చిత్రం 'పటాస్'. సొంత బ్యానర్ నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆయనే నిర్మాత. అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ ఇటీవల విడుదల చేసారు. వాటికి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ సినిమా గురించి కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ ‘రొమాంటిక్ , యాక్షన్, మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకొంది. సాయికార్తీక్ మంచి సంగీతాన్ని అందించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని జనవరి 23న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

https://www.facebook.com/TeluguFilmibeat
కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ ''యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రమిది. కథలో వినోదానికీ చోటుంది. భారీ హంగులతో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరిస్తుంది'' అన్నారు. శ్రుతి సోధి పంజాబీ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకొంది శ్రుతి. అటు అందంగా కనిపించడంతోపాటు ఇటు నటనలోనూ రాణిస్తోంది. చిత్రంలో కల్యాణ్‌రామ్ పోలీసు అధికారిగా కనిపిస్తారు. కథలో మలుపులు రక్తికట్టించేలా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది.
సాయికుమార్, బ్రహ్మానందం, అశుతోష్ రాణా, ఎమ్మెస్ నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాశ్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: సర్వేశ్ మురారి, ఎడిటింగ్: తమ్మిరాజు, రచనా సహకారం: ఎస్.కృష్ణ, నిర్మాత: నందమూరి కల్యాణ్‌రామ్, కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ రావిపూడి.