ఎన్టీఆర్ ప్రచారం పలించింది: ‘పటాస్’ టాక్ అదుర్స్....
హైదరాబాద్: కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘పటాస్' చిత్రం ఈ రోజు గ్రాండ్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రచారంలోకి స్వయంగా కళ్యాణ్ రామ్ తమ్ముడు యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ రంగంలోకి దిగడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. సినిమా బావుండబట్టే ఎన్టీఆర్ స్పెషల్ కేర్ తీసుకున్నారని నందమూరి అభిమానులు ఇప్పటి వరకు చెబుతూ వచ్చారు.
తాజాగా సినిమా చూసిన వారి నుండి....పాజిటివ్ టాక్ వస్తోంది. పవర్ ఫుల్ మాస్ ఎంటర్టెనర్ అని అంటున్నారు. మొత్తానికి చాలా కాలం తర్వాత కళ్యాణ్ రామ్ కెరీర్లో ఓ హిట్ సినిమా వచ్చి పడింది. ఆయన కెరీర్లో ఇదే పెద్ద హిట్టుగా నిలవనుంది. హీరో క్యారెక్టరైజేషన్ బావుందని, సినిమాలో వినోదం పాళ్లు కూడా మెండుగా ఉన్నాయని అంటున్నారు. కామెడీ కూడా బావుందని టాక్.

హైదరాబాద్ లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు ఏరియాలోని భ్రమరాంబ థియేటర్లో ఉదయం 7 గంటలకు బెనిఫిట్ షో వేసారు. సినిమా చూసిన ఫ్యాన్స్ కి సినిమా తెగ నచ్చడంతో పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేసారు. కళ్యాణ్ రామ్ యువ సేన వారు చారిటీ కోసం ఈ షో ఆర్గనైజ్ చేసారు.
సాయికుమార్, బ్రహ్మానందం, అశుతోష్ రాణా, ఎమ్మెస్ నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాశ్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: సర్వేశ్ మురారి, ఎడిటింగ్: తమ్మిరాజు, రచనా సహకారం: ఎస్.కృష్ణ, నిర్మాత: నందమూరి కల్యాణ్‌రామ్, కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ రావిపూడి.


Click it and Unblock the Notifications











