»   » ఉత్కంఠ: డీఎన్ఏ టెస్టుకు ఒప్పుకోని ధనుష్, అతడిపైనే అనుమానం!

ఉత్కంఠ: డీఎన్ఏ టెస్టుకు ఒప్పుకోని ధనుష్, అతడిపైనే అనుమానం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీ నటుడు ధనుష్‌ తమ కొడుకే అంటూ కదిరేశన్, మీనాక్షి అనే దంపతుు కోర్టు కెక్కిన సంగతి తెలిసిందే. వయసు పైబడటంతో తమ పరిస్థితి చాలా దీనంగా ఉందని, తమకు కొడుకు ధనుష్ ద్వారా నెలకు రూ. 65 వేలు మెయింటనెన్స్ ఇప్పించాలని వారు కోర్టును ఆశ్రయించాడు.

అయితే ధనుష్ మాత్రం కదిరేశన్ దంపతుల వాదనను తోసి పుచ్చుతున్నారు. వారితో తనకు ఏ సంబంధం లేదు, తాను రాజా కొడుకునే అంటూ వాదిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో కదిరేశన్ దంపతులు సమర్పించిన సాక్ష్యాలే బలంగా ఉన్నాయి. ధనుష్ నుండి ఎలాంటి సాక్ష్యాలు లేవు. డీఎన్ఏ టెస్టుకు కూడా ధనుష్ ఒప్పుకోవడం లేదు. దీంతో అందరి అనుమానం ధనుష్ మీదనే వ్యక్తం అవుతోంది.

ధనుష్ వాదన ఇలా

ధనుష్ వాదన ఇలా

ఈ కేసులో నేను ఏదీ దాయడం లేదు, కానీ డిఎన్ఏ టెస్టుకు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోనని ధనుష్ తేల్చి చెప్పారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఇది క్రిమినల్ కేసు కాదు. ఇలాంటి పనికిమాలిన, నిష్ప్రయోజనమైన కేసుల్లో డీఎన్ఏ టెస్టు చేసి తన ప్రైవసీకి ప్రైవసీకి భంగం కలించడానికి ఒప్పుకోను, ఇది తన హక్కు అని ధనుష్ కోర్టు ముందు వాదించారు.

కేసు రిజర్వ్

కేసు రిజర్వ్

ఇలాంటి సాధారణమైన కేసుల్లో డీఎన్ఏ టెస్టుకు ఆదేశించే అధికారం కోర్టు పరిధిలో లేనందున మద్రాస్‌ హైకోర్టు మధురై బెంచ్‌ ఈ కేసు తీర్పును రిజర్వ్ లో పెట్టింది. తీర్పు ఎప్పుడు వెలువడుతుందనే డేట్ కూడా మెన్షన్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందని, ఎప్పుడు వస్తుంది అనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

పుట్టు మచ్చలు చెరిపేసుకున్నాడు

పుట్టు మచ్చలు చెరిపేసుకున్నాడు

కథిరేసన్ దంపతులు కోరినట్లు ధనుష్ పుట్టు మచ్చలను వైద్యులు పరిశీలించి నివేదిక సమర్పించారు. లేజర్ టెక్నాలజీ ద్వారా ధనుష్ తన ఒంటిపై ఉన్న పుట్టు మచ్చలను చెరిపేసుకున్నాడని తమ నివేదికలో పేర్కొన్నారు.

ధనుష్ మా కొడుకే

ధనుష్ మా కొడుకే

తానొక రిటైర్డ్ బస్ కండక్టర్ అని, తన కుమారుడు 10వ తరగతి వరకు మేలూరులోని ఆర్ సి మిడిల్ స్కూల్ మరియు ప్రభుత్వ బాలుర పాఠశాలలో విద్యనభ్యసించాడని, తర్వాత 2002లో అతన్ని 11వ క్లాసు చదువకోసం శివగంగ జిల్లా తిరుపథూర్ లోని అరుముగమ్ పిల్లై సతాయ్యామ్మాల్ హెచ్ఎస్ఎస్ లో చేర్పించామని.... అక్కడ చేర్పించిన నెలరోజుల్లోనే స్కూలు విడిచి పారిపోయాడని, అక్కడి నుండి పారిపోయిన తర్వాత చెన్నై వెళ్లాడు... సినిమా రంగంలో కెరీర్ ప్రారంభించాడు. తన పేరు కూడా థనుష్ కె రాజాగా మార్చుకున్నాడు అంటూ కదిరేశన్ దంపతులు వాదిస్తున్న సంగతి తెలిసిందే.

English summary
Actor Dhanush on Tuesday told the Madras High Court Bench here that he was opposing the plea for a DNA test made by a couple who had filed a maintenance case before a lower court claiming to be his biological parents, not because he had something to hide, but because his integrity and right to privacy should not be tested at the instance of people who file frivolous cases.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu