‘పవన్ కళ్యాణ్ వల్లే...ఆమె ప్రాణం నిలబడింది’
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను అభిమానులు అంతగా ఎందుకు ఆరాధిస్తారంటే...ఆయన దగ్గర క్రమశిక్షణ, మంచితనం, నిజాయితీ, సేవాభావం ఉన్నాయి, ఆయన యూత్ ఐకాన్‌గా నిలవడానికి ప్రధాన కారణం ఆ విశిష్టమైన గుణాలే అంటూ ఆ మధ్య 'గబ్బర్ సింగ్' దర్శకుడు హరీష్ శంకర్ ఉద్వేగంగా చెప్పిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పర్సనల్ లైఫ్‌ను, సినిమాలను పరిశీలించినా ఈ విషయం మనకు స్పష్టంగా అర్థం అవుతుంది.
పవన్ కళ్యాణ్ మంచి మనసుకు నిదర్శనం కేరెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల. ఒక రకంగా చెప్పాలంటే పవర్ స్టార్ వల్లనే ఆమె ఈ రోజు మన ముందు ఆరోగ్యంగా ఉంది. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు పావలా శ్యామలనే. ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. పవర్ స్టార్ 'సుస్వాగతం' సినిమా చేస్తున్నప్పుడు పావలా శ్యామల జూనియర్ ఆర్టిస్టుగా ఉండేది. అప్పుడు ఆమెకు తీవ్రమైన జబ్బు వచ్చింది. వైద్యం చేయించుకునే డబ్బులు కూడా లేని పరిస్థితి.
ఆ సమయంలో పావలా శ్యామల పవన్‌ని కలిసి తన సమస్య గురించి చెప్పగా వెంటనే స్పందించిన పవన్ రూ. లక్ష రూపాయలు ఆమెకు సహాయం చేశాడు. ఇది నిజంగా అభినందించ దగ్గ విషయం. పవర్ స్టార్ అభిమానులు కూడా ఆయన్ను ఆదర్శంగా తీసుకుని పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారనంటే అని నిజంగా పవర్ స్టార్ చలవే అని చెప్పక తప్పదు.
మంచి చేసే వారికి ఎప్పటికైనా మంచే జరుగుతుంది, కాస్త ఆలస్యం అయినా పవన్ కళ్యాణ్ పవర్ రేంజికి తగిన విధంగా 'గబ్బర్ సింగ్' చిత్రం హిట్టయిందని అంటూ సంబర పడిపోతున్నారు అభిమానులు.
గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటించిగా.... మలైకా అరోరా, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, అలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాష్, మాస్టర్ నాగన్, ప్రవీణ్, మర్ల శ్రీను, కాభీభట్ల ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్.


Click it and Unblock the Notifications











